సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్18 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా.. ‘ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు హృదయపూర్వక అభినందనలు.
స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ బలోపేతంలో ఈ ప్రయోగం కీలక మైలురాయి. అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతలో దేశ స్వావలంబనను మరింత బలోపేతం చేసే విజయం ఇది. ప్రజలకు కీలక సేవలు అందించడంలో ఈ ఉపగ్రహం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం, మేధస్సు, నిరంతర కృషి దేశానికే గర్వకారణం’ అని పోస్టు చేశారు.
Hearty congratulations to our scientists and engineers at @isro on the successful launch of #GSLVF18 carrying the #NVS03 satellite. This milestone marks a vital step in strengthening NavIC, our indigenous navigation system, bolstering self-reliance in cutting-edge space technology and delivering critical services to our citizens. The dedication, intellect, and relentless pursuit of excellence by our space scientists continue to make the entire nation proud.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2026
ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై అక్రమ కేసు


