ఎన్నికల బరిలో భార్యాభర్తలు | Husband And Wife Contest ZPTC And MPTC Elections On YSRCP Ticket In NTR District, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఎన్నికల బరిలో భార్యాభర్తలు

Oct 31 2026 11:23 AM | Updated on Oct 31 2026 11:53 AM

husband and wife contest in ap local body elections

వేమా సురేష్‌ ​బాబు, జెడ్పీటీసీ అభ్యర్థి వేమా రోజారమణి ఎంపీటీసీ అభ్యర్థి

ఒకరు జెడ్పీటీసీగా...   మరొకరు ఎంపీటీసీగా... 

గతంలో భర్త కంచికచర్ల మేజర్‌  గ్రామ పంచాయతీ ఉపసర్పంచి 

 భార్య కంచికచర్ల ఎంపీటీసీ సభ్యురాలు 

 వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలే తిరిగి గెలిపిస్తాయని ధీమా  

ఎన్టీఆర్‌ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున భార్యాభర్తలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్నారు. గతంలో కంచికచర్ల ఉపసర్పంచిగా పనిచేసిన వేమా సురేష్‌ బాబు ప్రస్తుతం జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గతంలో ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేసిన ఆయన భార్య వేమా రోజారమణి తిరిగి అదే స్థానంలో పోటీలో ఉన్నారు.  

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం 
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఈ దంపతులకు స్థానిక రాజకీయాలతో పాటు ప్రజా సేవలో అనుభవం ఉంది. సురేష్‌ బాబు తాత వేమా నరసింహారావు 20 ఏళ్లపాటు కంచికచర్ల మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచిగా పనిచేసి గ్రామ రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు. అదే రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వేమా సురేష్‌బాబు గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఉపసర్పంచిగా ఎన్నికై ఐదేళ్ల పాటు గ్రామ అభివృద్ధి  కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించారు. మరో వైపు వేమా రోజారమణి గతంలో ఎంపీటీసీగా పోటీచేసి విజయం సాధించారు. తన సెగ్మెంట్‌ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేశారు.   

తిరిగి ప్రజా క్ష్రేత్రంలోకి ... 
ఇప్పుడు మరోసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన ఈ దంపతులు వేర్వేరు స్ధానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో భార్యాభర్తల రాజకీయ ప్రయాణానికి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో... జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ప్రజల మద్దతు ఎవరికి లభిస్తుందో... ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement