సాక్షి, అనంతపురం జిల్లా: రాప్తాడులో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి చేశాడు. బాలిక ముఖంపై రంపంతో విచక్షణరహితంగా దాడి చేశాడు. విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. అడ్డుకోబోయిన మరో బాలికకు గాయాలయ్యాయి.
క్లాస్ రూమ్‌లోనే ఘాతుకానికి పాల్పడిన ఉన్మాది.. బాలికను ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణరహితంగా కోశాడు. కుడిచేయి తెగిపోగా, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థిని ప్రాణాలతో కొట్టుమిట్లాడుతుంది. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయ్యవారిపల్లెకు చెందిన బాలికగా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
క్లాస్ రూమ్‌లోనే దాడి: స్కూల్ హెచ్‌ఎం
స్కూల్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. నిర్మాణ పనుల్లో భాగంగా పలువురు స్కూల్‌కు వస్తున్నారని స్కూల్ హెచ్‌ఎం తెలిపారు. క్లాస్ రూమ్‌లోనే దాడి జరిగింది. ఆ సమయంలో క్లాస్ రూమ్‌లో టీచర్ ఉన్నారు. ఉదయం 10:30 గంటలకు ఘటన జరిగిందని హెచ్‌ఎం పేర్కొన్నారు. దాడి చేసిన దుండగుడిని మేం గమనించలేదు. మరో బాలికకు కూడా గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన తర్వాత రంపం వదిలేసి పారిపోయాడని స్కూల్ హెడ్ మాస్టర్ తెలిపారు.
ఘటనపై బంధువుల ఆగ్రహం
రంపంతో స్కూల్‌లోకి దుండగుడు ప్రవేశించడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్లు, సెక్యూరిటీ ఏం చేస్తున్నారు. స్కూల్‌కు కట్టెలు కట్ చేసే మిషన్ తీసుకొస్తుంటే ఏం చేస్తున్నారు?’’ అంటూ నిలదీశారు. రోజు ఆటోల్లో స్కూల్‌కు వెళ్తుందన్న బాలిక మేనత్త.. ఎవరూ వేధిస్తున్నట్లు తమ పాప చెప్పలేదన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. నిందితుడి ఎవరైనా, ఆఖరికి మా బంధువైన కఠినంగా శిక్షించాల్సిందేనని బాలిక మేనత్త అన్నారు.
ఇదీ చదవండి: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3 రోజులు వర్షాలు


