‘రుణం తీర్చుకునే సమయం వచ్చిందిరా రామచంద్రా!’ | YS Jagan Welfare Schemes, Story Of Public Gratitude And Continued Support In AP | Sakshi
Sakshi News home page

‘రుణం తీర్చుకునే సమయం వచ్చిందిరా రామచంద్రా!’

Oct 31 2026 9:55 AM | Updated on Oct 31 2026 9:55 AM

YS Jagan Welfare Schemes, Story Of Public Gratitude And Continued Support In AP

ఆ సాయంత్రం కలసపాడు పీర్ల చావిడి రచ్చబండ వద్ద ఊరి పెద్దమనిషి రామకృష్ణారెడ్డి చేతిలోని   పేపర్‌ మడతపెట్టి తీవ్ర ఆలోచనలో పడ్డాడు. పక్కనే ఉన్న యువకుడు రామచంద్ర కారణం అడగ్గా.. ‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదురా! కష్టకాలంలో కొండంత అండగా ఉన్న జగనన్నను గత ఎన్నికల్లో పొరపాటున దూరం చేసుకున్నాం. తోడు నిలిచినోడిని మరిచిపోతే మనుషులం కాము. ఇప్పుడు జరిగే ఎన్నికల్లోనైనా ఆయన రుణం తీర్చుకుందామనుకుంటే.. కూటమి వాళ్లు పోలీసులతో భయపెట్టి చాలా చోట్ల దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. అయినా సరే, మిగిలిన 1 కార్పోరేషన్, 2 మున్సిపాలిటీలు, 16 జడ్‌పీటీసీలు, 63 ఎంపీటీసీ స్థానాల్లో మన వైఎస్సార్సీపీ అభ్యర్థులు కూటమి రౌడీ మూకల దెబ్బలకు ఎదురొడ్డి నామినేషన్లు వేశారు. నవంబర్‌ 5న వీరందరినీ గెలిపించి జగనన్న పరువు కాపాడుకోవాల్ఙి అని పిలుపునిచ్చాడు. 

పక్కనే ఉన్న కుర్రాడు శ్రీకాంత్‌ కొంచెం వెటకారంగా.. ‘రాజకీయ నాయకులకు రుణపడడం ఏంటి మామా? వాళ్లు పథకాలిస్తారు, మనం ఓట్లేస్తాం’అనడంతో రామకృష్ణారెడ్డి అతడి భుజం తట్టి.. ‘నువ్వు కుర్రాడివిరా, నీకు గతం తెలీదు. ఒకప్పుడు మీ చెల్లెలి చదువుకు ఫీజుల్లేక మీ నాన్న పడ్డ ఇబ్బంది గుర్తుందా? ఆనాడు ‘అమ్మఒడి’ రాబట్టే కదా తను కాలేజీ చదువు చదువుతోంది. పేదవాడి పిల్లవాడు కూడా చదువుకోవాలనే ఆ ఆలోచన జగనన్నది కాదా?’ అని నిలదీశాడు. అంతటితో ఆగక రామచంద్ర వైపు తిరిగి.. ‘నీ విషయానికే వస్తే, మీ అమ్మగారి ఆపరేషన్‌కు కడప పెద్దాసుపత్రిలో ‘ఆరోగ్యశ్రీ’ లేకపోతే లక్షలు ఎక్కడి నుండి తెచ్చేవాడివిరా? ఉన్న ఆ కాస్త పొలం ముక్క కూడా అమ్ముకునేవాడివి కదా! రైతు భరోసా పెట్టుబడి సాయం, ఒకటో తారీఖునే తలుపు తట్టే అవ్వాతాతల పింఛన్లు ఎందరి ఇళ్లల్లో ధీమా నింపాయో ఆలోచించు’ అని విడమరిచి చెప్పాడు. 

అదే సమయంలో అక్కడికి వచ్చిన స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ రామారెడ్డి కూడా మాట కలిపారు.. ‘కేవలం ఓటు–సీటు లెక్కలతో చూస్తే కృతజ్ఞతకు అర్థమే ఉండదు శ్రీకాంత్‌. వర్షం వస్తే కారే కప్పులు, విరిగిన బల్లలతో ఉన్న మన ఊరి బడి ఇవాళ ‘నాడు–నేడు’తో కార్పోరేట్‌ స్కూళ్లకు దీటుగా మారింది. ఇంగ్లీష్‌ మీడియం చదువులు, విద్యా కానుక కిట్లు, రుచికరమైన గోరుముద్ద భోజనం అందుతున్నాయి. ఈ మార్పు తెచ్చిన నాయకుడికి మనం కృతజ్ఞత చూపించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. డ్వాక్రా సంఘం లీడర్‌ మల్లేశ్వరమ్మ కూడా తన పొదుపు పుస్తకం సర్దుకుంటూ రచ్చబండ వద్దకు చేరి.. ‘ఈ శ్రీకాంత్‌ గాడికేం తెలుసు మామాయ్యా! వైఎస్సార్‌ ఆసరా, చేయూత, ఈబీసీ, కాపు నేస్తం, ఇళ్ల స్థలాలతో మా మహిళల బతుకులు ఎలా మారాయో మాకు తెలుసు. వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే మేము ఇవాళ సొంత కాళ్లపై నిలబడ్డాం. తండ్రీకొడుకులిద్దరూ మమ్మల్ని సమాజంలో తలెత్తుకునేలా చేశారు. రెండేళ్ల నాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయాం, మళ్లీ ఆ తప్పు చేయొద్దు. కూటమి దౌర్జన్యాలకు భయపడకుండా ఫ్యాను గుర్తుకే ఓట్లు వేసి గెలిపించుకుందాం’ అని భావోద్వేగంతో పిలుపునిచ్చింది. 

చివరగా పెద్దాయన రామకృష్ణారెడ్డి.. ‘నాయకులు, ప్రభుత్వాలు మారవచ్చు కానీ కష్టకాలంలో సంక్షేమ పథకాలతో మన ఇళ్లను నిలబెట్టిన ఆ నమ్మకాన్ని, ఆ మనిషిని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనం తీర్చుకునే రుణం’ అనడంతో, వెటకారం చేసిన శ్రీకాంత్‌ కూడా తప్పు తెలుసుకుని.. ‘నిజం చెప్పావు మామా.. సాయం చేసిన వాణ్ణి మరిచిపోవడం నమ్మకద్రోహమే అవుతుంది. మన మద్దతు ఎప్పుడూ జగనన్నకే’ అన్నాడు. రచ్చబండ వద్ద ఉన్న గ్రామస్తులంతా అవునంటూ తలూపారు. చీకటి పడుతున్నా ఆ పల్లెటూరి మనుషుల మనసుల్లో మాత్రం జగనన్న పట్ల ‘కృతజ్ఞత’అనే వెలుగు స్పష్టంగా కనిపించింది. 
– కాతా వెంకట నరసింహారెడ్డి, బద్వేలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement