సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎన్నికలకు ముందే కడపలో పచ్చ మూకలు దిగిపోయారు. నగరంలోని సాయిపేటలో మకాం వేశారు. ఎన్నికల్లో దాడులు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున పోలింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకేనని ప్రచారం జరుగుతోంది. అల్లర్లు చేసి కూటమికి అనుకూలంగా పోలింగ్ జరిగేలా కుట్రలకు తెరతీశారు.
ఓటర్లను భయపెట్టి వైఎస్సార్‌సీపీకి ఓటేయకుండా అడ్డుకునేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రచారం ముగిసిన తర్వాత బయట వ్యక్తులు రాకూడదని నిబంధనలు చెబుతున్నా.. పచ్చమూకలు పట్టించుకోవడం లేదు. నగరంలోని పాలెంపల్లికి చెందిన ఓ నేత ఆధ్వర్యంలో టీడీపీ గూండాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. పోలీసులు ఏమాత్రం.. అటువైపు చూడటం లేదు.
కాగా, పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా చేసి, అధికార పార్టీ గూండాలు బూత్‌లను పూర్తిగా అక్రమించుకొని ఎన్నికలను ఏకపక్షంగా జరిపేందుకు ప్రభుత్వ పెద్దలు కొత్త దుర్మార్గాలకు తెరతీశారు. పోలీసులు, ఎన్నికల అధికారులను అడ్డుపెట్టుకుని పోలింగ్ ఏజెంట్ల నియామక నిబంధనలను సైతం ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు.

ఇదీ చదవండి: రిటర్నింగ్ అధికారులా.. అధికారపార్టీ ఏజెంట్లా?


