చంద్రబాబు డైరెక్షన్‌లో చెలరేగిపోయిన ఆర్వోలు
టీడీపీ కార్యకర్తలకంటే మిన్నగా పనిచేసిన అధికారులు
ప్రభుభక్తిని ప్రదర్శించడానికి పోటీపడిన దుర్మార్గం
ప్రతిపక్ష అభ్యర్థులకు తీరని అన్యాయం
పోలింగ్ కేంద్రాలలో కిరాయిమూకలకు, గంజాయి గుంపులకు చోటు
ఉన్నతాధికారులకు చెప్పకుండా అధికారపార్టీతో లాలూచీ
నామినేషన్ పత్రాలు మాయంచేశారు
చెక్‌లిస్ట్ ఇచ్చి అన్నీ బాగున్నాయని చెప్పి సంతకాలు చేశారు
మర్నాటికి కొన్ని డాక్యుమెంట్లు తీసేసి చెల్లకుండా చేశారు
ఫోర్జరీ సంతకాలతో అభ్యర్థులను విత్‌డ్రా చేశారు..
నామినేషన్ల నుంచి ఏకగ్రీవాల దాకా.. అన్నీ అక్రమాలే!
సాక్షి, నెట్‌వర్క్: స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం గూండాలు, కిరాయి మూకలు, గంజాయి బ్యాచ్‌లు చేసిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ల సంగతలా ఉంచితే పోలింగ్ కేంద్రాలలో ఉన్న కొందరు రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) కూడా తెలుగుదేశం కార్యకర్తలను, కిరాయి మూకలను మించి ప్రభుభక్తిని ప్రదర్శించారు. తమ చేతిలోని నామినేషన్ పత్రాలను టీడీపీ గూండాలు లాక్కుని చించుతుంటే బొమ్మల్లా నిలబడిపోయారు.
ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం ఇద్దరు, ముగ్గురు నాయకులతో కలసి పోలింగ్ కేంద్రాలకు వస్తే.. అప్పటికే పోలింగ్ కేంద్రాలలో మారణాయుధాలతో వందల మంది టీడీపీ గూండాలు ఉన్నారు. వారిని ఎలా అనుమతించారు? ఎందుకు అదుపు చేయలేదు? ఎన్నికలు జరుగుతున్నపుడు ఎన్నికల సంఘమే సుప్రీం కదా..? పై అధికారులకు వెంటనే తెలియజేసి అక్రమాలను ఎందుకు అడ్డుకోలేదు? ఇదంతా ఒక ఎత్తయితే తమను నమ్మి నామినేషన్ పత్రాలను ఇచ్చిన అభ్యర్థులకు కొందరు ఆర్వోలు మరింత ద్రోహం చేశారు. అధికార పార్టీకి అమ్ముడుపోయి తమ వృత్తికి కూడా ద్రోహం చేశారు. నీతి నిజాయితీలకు నీళ్లొదిలేశారు.
ఏకగ్రీవం చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చెల్లనీయకుండా చేశారు. చెక్‌లిస్ట్ ఇచ్చి అన్నీ బాగున్నాయని చెప్పి సంతకం చేసి మరీ అక్‌నాలెడ్జ్ స్లిప్పులు ఇచ్చి.. ఆ తర్వాత కొన్ని పత్రాలు చించేసి అవిలేవంటూ నామినేషన్లు తిరస్కరించారు. అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేసి విత్‌డ్రాలు చేసేశారు. అలాంటి అమ్ముడుపోయిన, దిగజారిపోయిన ఆర్వోలలో కొందరి గురించి చూద్దామా?
గిద్దలూరులో ఐదుగురి నామినేషన్లు మాయం!
నామినేషన్ పత్రాలు మాయం చేసి ప్రజాస్వామ్య హక్కులకే తూట్లు పొడిచిన ఆర్‌ఓ
ఆర్‌వో: వంగా జ్యోతి
ప్రాంతం: కొమరోలు మండలం, గిద్దలూరు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా
ఏం జరిగిందంటే: ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు మాయం! పత్రాలు కనిపించడం లేదంటూ ఐదుగురి నామినేషన్లూ తిరస్కరణ.
ఫలితం: ఎంపీటీసీ అభ్యర్థులు షేక్ తస్లీమా, కామూరి అమూల్య,
సారె ఓబులమ్మ, కరిస్మా, కామూరి శ్రీనివాసరెడ్డి నామిషన్ల తిరస్కరణ. జెడ్పీటీసీ అభ్యర్థి సారె వెంకటనాయుడు ఎన్నికల ఖర్చుల డిక్లరేషన్ తొలగింపు.. నామినేషన్ తిరస్కరణ!
పొందూరులో ఫేక్ విత్‌డ్రాలు!
అభ్యర్థుల ప్రమేయం లేకుండానే ఐదు నామినేషన్ల ఉపసంహరణ.. ఐదు స్థానాలు టీడీపీకి ఏకగ్రీవం చేసిన ఆర్‌ఓ!
ఆర్‌వో: సూర్యప్రకాశరావు
ప్రాంతం: పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా
ఏం జరిగిందంటే: మొదట 21 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లఆమోదం. 21 మందికి బీ ఫారాలు స్వీకరించి రసీదులు జారీ. కానీ, విత్‌డ్రా రోజు రాత్రి 8 గంటలకు ఐదుగురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లు నమోదు. విత్‌డ్రా ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అడిగితే కెమెరాలే లేవంటూ సమాధానం!
ఫలితం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రమేయం లేకుండానే నామినేషన్ల ఉపసంహరణ. ఐదు స్థానాలు టీడీపీకి ఏకగ్రీవం!
దర్శిలో వైఎస్సార్‌సీపీ నామినేషన్లు చించివేత!
ఎన్నికల అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తలా వ్యవహరించిన దర్శి ఆర్‌ఓ!
ఆర్‌వో: ఎంఈఓ–2 రమాదేవి
ప్రాంతం: దర్శి మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా
ఏం జరిగిందంటే: టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు ప్రాధాన్యం.
వైఎస్సార్‌సీపీ నేతల నామినేషన్ల స్వీకరణలో ఉద్దేశపూర్వక జాప్యం. సమయం వృథా చేస్తూ నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు. ఈలోపు టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్‌సీపీ నేతల నామినేషన్ పత్రాలు చించివేత. ఎన్నికల అధికారి ప్రేక్షకపాత్రకే పరిమితం!
ఫలితం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ వేసే అవకాశం కోల్పోయారు.
కురిచేడులో అభ్యర్థులు రాకుండానే విత్‌డ్రాలు!
అభ్యర్థుల ప్రమేయం లేకుండానే నామినేషన్ల ఉపసంహరణ.. టీడీపీకి ఏకగ్రీవాలను కట్టబెట్టిన ఆర్‌ఓ
ఆర్‌వో: పురుషోత్తమరాజు
ప్రాంతం: కురిచేడు మండలం, దర్శి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా ఏం జరిగిందంటే: నామినేషన్ల ఉపసంహరణ సమయంలో అభ్యర్థులు హాజరుకాకుండానే విత్‌డ్రాలు నమోదు. అభ్యర్థుల ప్రమేయం లేకుండానే నామినేషన్ల ఉపసంహరణ.
ఫలితం: టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఏకగ్రీవాల ప్రక్రియ జరిగింది. ప్రతిపక్ష అభ్యర్థుల ఎన్నికల హక్కులకు తీవ్ర విఘాతం.
తిరుపతి రూరల్‌లో పత్రాలు చించేసి.. పేజీలు మార్చేసి..!
ఆస్తుల వివరాల పత్రాలు మాయం.. నామినేషన్ పేజీల మార్పు.. నాలుగు అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ.. 10 ఎంపీటీసీ స్థానాలను కూటమికి ఏకగ్రీవం చేసేందుకు ఆర్‌ఓ యశ్వంత్ యత్నం!
ఆర్‌వో: యశ్వంత్
ప్రాంతం: తిరుపతి రూరల్ మండలం
ఏం జరిగిందంటే: సి.మల్లవరం ఎంపీటీసీ అభ్యర్థి మొక్కల తిమ్మారెడ్డి నామినేషన్‌లో ఆస్తుల వివరాల పత్రం చించివేసి, ఆస్తుల వివరాలు లేవంటూ తిరస్కరణ. అప్పీల్‌లోనూ అదే పత్రం లేదంటూ నామినేషన్ తిరస్కరణ. వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి వై.నాగలక్ష్మి నామినేషన్ పత్రాల్లోని పేజీలు మార్చేసి, ఆస్తుల వివరాలు లేవంటూ మూడు సెట్ల నామినేషన్ల తిరస్కరణ. పూర్తి వివరాలతో నామినేషన్ సమర్పించినట్లు వీడియో ఆధారం ఉందని చెప్పినా పట్టించుకోని అధికారి. వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఇండిపెండెంట్‌లుగా పోటీ చేసిన బి.శారద, ఎం.నారాయణమ్మ నామినేషన్లూ తిరస్కరణ.
ఫలితం: ఇలా మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలను కూటమికి ఏకగ్రీవం చేసేందుకు అధికార యంత్రాంగం పని చేసింది.
దుగ్గిరాలలో వార్డు నంబరు తప్పుతో నామినేషన్ ఔట్!
6 కు బదులు 7 రాశారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ.. కూటమి అభ్యర్థుల తప్పులకు మాత్రం సవరణలతో ఆమోదం!
ఆర్‌వో: టి.నరసింహారెడ్డి
ప్రాంతం: చిలువూరు–1, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా
ఏం జరిగిందంటే: వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఓటరు జాబితాలో వార్డు నంబరు 6కు బదులు 7గా నమోదు. చిన్న పొరపాటును కారణంగా చూపి నామినేషన్ తిరస్కరణ. అదే సమయంలో కూటమి అభ్యర్థుల నామినేషన్ పత్రాల్లో తప్పులను కొట్టివేసి సరిచేసుకునే అవకాశం. వారి నామినేషన్లకు మాత్రం ఆమోదముద్ర.
ఫలితం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ. పోటీకి దూరమైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తనకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధం.
చేబ్రోలులో ఏకపక్షంగా 19 నామినేషన్లు ఔట్!
19 వైఎస్సార్‌సీపీ నామినేషన్ల తిరస్కరణ.. అప్పీల్‌లో ఆర్‌ఓ నిర్ణయాలకు ఎదురుదెబ్బ..
ఆర్‌వో: కోమలి పద్మ
ప్రాంతం: చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా
ఏం జరిగిందంటే: 19 వైఎస్సార్‌సీపీ నామినేషన్లను చిన్నచిన్న కారణాలతో తిరస్కరించిన ఆర్‌ఓ కోమలి పద్మ. ఆమె నిర్ణయాలపై నిర్ణయాలపై తెనాలి ఆర్‌డీఓకు అప్పీల్.
ఫలితం: ఆర్డీఓ విచారణలో నాలుగు నామినేషన్ల తిరస్కరణ.. ఆరు నామినేషన్ల ఆమోదం. తెనాలి, శేకూరులో ఓటు హక్కు ఉందనే కారణంతో ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ. ఆర్‌ఓ నిర్ణయాల్లో కొన్ని అప్పీల్ స్థాయిలో మారడం అధికారుల పరిశీలనా తీరుపై ప్రశ్నలు లేవనెత్తింది.
చిత్తూరులో ఫోర్జరీ విత్‌డ్రాలు.. 51 డివిజన్లు ఏకగ్రీవం!
అభ్యర్థుల సంతకాల ఫోర్జరీతో ఉపసంహరణ లేఖల సృష్టి.. వాటిని ఆమోదించి ఏకగ్రీవాలు ప్రకటించిన ఆర్‌ఓ
ఆర్‌వో: సోమశేఖర్
ప్రాంతం: చిత్తూరు కార్పొరేషన్
ఏం జరిగిందంటే: మొత్తం 60 డివిజన్లలో ఏకంగా 51 డివిజన్లకు ఏకగ్రీవాల ప్రకటన. టీడీపీకి 47, జనసేనకు 2, బీజేపీకి 1, వైఎస్సార్‌సీపీకి 1 స్థానం కేటాయింపు. అభ్యర్థులు, ప్రతిపాదకులు ఉపసంహరించుకోకుండానే వారి సంతకాలతో ఫోర్జరీ విత్‌డ్రా లేఖల సృష్టి. అసలు సంతకాల ప్రామాణికతను నిర్ధారించకుండానే ఉపసంహరణలు ఆమోదించిన ఆర్‌ఓలు.
ఫలితం: ఫోర్జరీ లేఖల ఆధారంగా 51 డివిజన్లకు ఏకగ్రీవ డిక్లరేషన్లు!
నగరిలో ముందు ధ్రువీకరణ.. తర్వాత నామినేషన్ తిరస్కరణ!
ఫారం–7 ఇచ్చి మరీ మాట మార్చిన ఆర్‌ఓ.. టీడీపీకి ఏకగ్రీవ పట్టం!
ఆర్‌వో: సంజీవకుమార్
ప్రాంతం: నగరి మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా
ఏం జరిగిందంటే: వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి బాలకృష్ణన్ నామినేషన్ పరిశీలన అనంతరం పోటీలో ఉన్నట్లు ఫారం–7 జారీ. కొద్దిసేపటికే అదే నామినేషన్ చెల్లదంటూ తిరస్కరణ. పోటీలో ఉన్నట్లు ధ్రువీకరించిన నామినేషన్‌ను కొద్దిసేపటికే ఎలా తిరస్కరించారు?
ఫలితం: టీడీపీ అభ్యర్థి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటన.
ఆలూరులో కారణాలు చెప్పకుండానే నామినేషన్లు ఔట్!
ముగ్గురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ.. లోపాలు సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వని ఆర్‌ఓ
ఆర్‌వో: ఆనంద్ రాజ్‌కుమార్
ప్రాంతం: ఆలూరు, కర్నూలు జిల్లా
ఏం జరిగిందంటే: పెద్దహోతూరు–2 ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మి, మొలగవల్లి–2లో నరసమ్మ, ఆలూరు–3 వినోద్‌కుమార్ నామినేషన్లలో తప్పులున్నాయంటూ స్పష్టమైన వివరాలు ఇవ్వకుండా ఆర్‌డీఓ వద్దకు పంపించడం. చెక్‌లిస్ట్, ఫారం–5 ఇవ్వకుండానే నరసమ్మ నామినేషన్ తిరస్కరణ. ఆర్‌డీఓ వద్ద కూడా తిరస్కరణకు స్పష్టమైన కారణాలు వెల్లడించకపోవడం. లోపాలు సరిదిద్దుకునేందుకు కార్యాలయంలోకి వెళ్లే అవకాశం కూడా నిరాకరణ.
ఫలితం: చివరకు ముగ్గురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల బరిలో లేకుండా పోవడం!
నారాయణవనంలో ఐదు ఎంపీటీసీలు టీడీపీకి ధారాదత్తం!
అర్ధరాత్రి ఫోన్‌కాల్స్ తర్వాత విత్‌డ్రాల ప్రకటన
ఆర్‌వో: విజయానంద్
ప్రాంతం: నారాయణవనం మండలం, తిరుపతి జిల్లా
ఏం జరిగిందంటే: మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాల్లో ఐదు స్థానాలకు చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ. డిక్లరేషన్ ఫారంలో సంతకం లేదంటూ నామినేషన్లు తిరస్కరించిన ఆర్‌ఓ విజయానంద్. సంతకాలు లేని నామినేషన్ పత్రాలనే స్వీకరించి రసీదులు ఎలా ఇచ్చారు? అంటే సమాధానం లేదు. టీడీపీ రెబల్, డమ్మీ అభ్యర్థుల విత్‌డ్రాల కోసం రాత్రి 7.30 వరకు వేచి ఉన్నారు. అభ్యర్థుల నుంచి నేరుగా ఉపసంహరణ పత్రాలు తీసుకోకుండానే టీడీపీ నాయకుల ఫోన్‌కాల్స్ కోసం నిరీక్షణ.
ఫలితం: రాత్రి 7.40 గంటలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి... ఐదు స్థానాల్లో ఏకగ్రీవాల ప్రకటన!
కోటబొమ్మాళిలో టీడీపీ అభ్యర్థులకే వెసులుబాటు!
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ.. టీడీపీ అభ్యర్థుల తప్పులకు అక్కడికక్కడే సవరణలు చేసిన ఆర్‌ఓ!
ఆర్‌వో: కె.జగన్మోహన్‌రావు
ప్రాంతం: కోటబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా
ఏం జరిగిందంటే: దంత ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమసుందర్‌రాజు నామినేషన్ దాఖలు. పరిశీలనకు పిలిపించి చిన్నచిన్న కారణాలు చూపిస్తూ నామినేషన్ తిరస్కరణ. టీడీపీ అభ్యర్థుల పత్రాల్లో ఎన్ని తప్పులున్నా వెసులుబాటు. పత్రాల్లో లోపాలున్నా అక్కడికక్కడే సరిదిద్దుకునే అవకాశం. ప్రతిపక్ష అభ్యర్థికి ఒక నిబంధన.. టీడీపీ అభ్యర్థులకు మరో నిబంధన!
ఫలితం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమసుందర్‌రాజు పోటీకి
విత్‌డ్రా పేరుతో వంచన..
ఒక నామినేషన్ ఉపసంహరించుకోమని చెప్పి.. మొత్తం నామినేషన్‌నే లేకుండా చేసిన ఆర్‌ఓ
ఆర్‌వో: కె.జగన్మోహన్‌రావు
ప్రాంతం: చిన్నసాన ఎంపీటీసీ, కోటబొమ్మాళి మండలం, టెక్కలి నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా
ఏం జరిగిందంటే: రొక్కం శ్రావణి పేరుతో వేర్వేరు ప్రతిపాదకులతో రెండు నామినేషన్లు దాఖలు. ఒక నామినేషన్ ఉపసంహరించుకోవాలని అధికారుల సూచన. అధికారుల సూచన మేరకు ఒక నామినేషన్ విత్‌డ్రా.
ఫలితం: బీ.ఫారం సమర్పించేందుకు శ్రావణి వెళితే మొత్తం నామినేషన్ తిరస్కరణకు గురైందంటూ సమాధానం!.
మార్కాపురంలో వైట్‌నర్ సాకు.. నామినేషన్ ఔట్!
వైట్‌నర్ వాడొచ్చని చెప్పి.. అదే కారణంతో నామినేషన్ తిరస్కరించిన ఆర్‌ఓ
ఆర్‌వో: డి.రవిప్రసాద్
ప్రాంతం: భూపతిపల్లి ఎంపీటీసీ స్థానం, మార్కాపురం మండలం
ఏం జరిగిందంటే: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భవనం వెంకట రామిరెడ్డి నామినేషన్ దాఖలు. ఫారం నింపే సమయంలో వైట్‌నర్ వాడవచ్చని అధికారుల సూచన.
ఫలితం: స్క్రూటినీ సమయంలో అదే వైట్‌నర్‌ను కారణంగా చూపి నామినేషన్ తిరస్కరణ. ముందుగా అనుమతి.. తర్వాత అదే అంశంపై అభ్యంతరం.. చివరకు అభ్యర్థి పోటీకి దూరం!
వైఎస్సార్‌సీపీకి ఒక న్యాయం.. టీడీపీకి మరో న్యాయం!
ఒకే తరహా జిరాక్స్ సర్టిఫికెట్.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ ఔట్.. టీడీపీ అభ్యర్థికి మాత్రం అప్పీల్‌లో ఆమోదం!
ఆర్‌వో: నారాయణస్వామి
ప్రాంతం: అనంతపురం రూరల్ మండలం
ఏం జరిగిందంటే: కందుకూరు–1 వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కామక్కగారి మురళి ఒరిజినల్ కుల ధ్రువీకరణపత్రం టీడీపీ వ్యక్తులు చించేయడంతో జిరాక్స్ కాపీతో నామినేషన్ దాఖలు.
ఫలితం: స్క్రూటినీ సమయంలో ఒరిజినల్ పత్రం సమర్పించినా, జిరాక్స్ కాపీ జత చేశారనే కారణంతో నామినేషన్ తిరస్కరణ. ఆర్‌డీఓను ఆశ్రయించినా మురళికి న్యాయం జరగలేదు. అదే మండలం రాచాననపల్లి–1 టీడీపీ అభ్యర్థి డి.రమ్య కూడా జిరాక్స్ కాపీనే సమర్పించారు. ఆమె నామినేషన్‌ను తొలుత తిరస్కరించినా, అప్పీల్‌లో ఆర్‌డీఓ ఆమోదం.
నామినేషన్ పత్రం చించేసి తిరస్కరణ!
ముందు రాళ్ల దాడితో నామినేషన్‌కు అడ్డంకులు.. మరుసటి రోజు పత్రం చించేసి నామినేషన్ ఔట్.. చివరకు టీడీపీకి ఏకగ్రీవం!
ఆర్‌వో: గోపాల్‌నాయక్
ప్రాంతం: బండారుపల్లి, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా
ఏం జరిగిందంటే: మాజీ వైస్ ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి టి.జనార్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలుకు వెళ్తుండగా ఏర్పేడు కేంద్రం వద్ద సుమారు 500 మంది టీడీపీ మూకల రాళ్ల దాడి. అభ్యర్థితోపాటు ఇద్దరు నామినీలపై దాడి.. ప్రాణభయంతో వెనుదిరగడం. ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి చొరవతో మరుసటి రోజు నామినేషన్ దాఖలు.
ఫలితం: పరిశీలన సమయంలో నామినేషన్ పత్రాల్లో ఒకటి చించేసి,
దాని స్థానంలో ఖాళీ ఫారం పెట్టడం. సంతకం లేదనే కారణంతో నామినేషన్ తిరస్కరణ. చివరకు ఆ స్థానం టీడీపీకి ఏకగ్రీవం.
ఏర్పేడులో బలవంతపు విత్‌డ్రాలు!
ఎనిమిది వైఎస్సార్‌సీపీ నామినేషన్ల తిరస్కరణ.. మరో రెండింటిపై బలవంతపు విత్‌డ్రాలు.. ఆర్‌ఓ గోపాల్‌నాయక్ వ్యవహారం!
ఆర్‌వో: గోపాల్‌నాయక్
ప్రాంతం: ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా
ఏం జరిగిందంటే: మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు. వాటిలో ఎనిమిది నామినేషన్లను కుంటి సాకులతో తిరస్కరించిన ఆర్‌ఓ. మిగిలిన రెండు స్థానాల్లోనూ టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో బలవంతపు ఉపసంహరణలు.
ఫలితం: 16 స్థానాల్లో 15 స్థానాలు కూటమికి ఏకగ్రీవం.
రామచంద్రాపురంలో ఏకపక్షంగా తిరస్కరణ!
కనీస తనిఖీ లేదు.. వివరణకు అవకాశం లేదు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లకు వరుసగా తిరస్కరణలు..
ఆర్‌వో: వసంత్ బాయ్
ప్రాంతం: రామచంద్రాపురం మండలం, తిరుపతి జిల్లా
ఏం జరిగిందంటే: నామినేషన్ల పరిశీలనను ఏకపక్షంగా నిర్వహించిన ఆర్‌ఓ.
ఫలితం: కనీస తనిఖీ, వివరణకు అవకాశం లేకుండానే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ.


