సిట్‌ వేస్తా.. అధికారుల సంగతి తేలుస్తా.. | Former Macherla MLA Pinnelli Ramakrishna Reddy warns Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సిట్‌ వేస్తా.. అధికారుల సంగతి తేలుస్తా..

Oct 31 2026 4:37 AM | Updated on Oct 31 2026 4:37 AM

Former Macherla MLA Pinnelli Ramakrishna Reddy warns Chandrababu Naidu

అధికారంలోకి వచ్చాక పక్షపాతంతో వ్యవహరించే ఎవరినీ వదిలిపెట్టం   

పోలీసు అధికారులు తమ తీరు మార్చుకోవాలి 

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరిక  

మాచర్ల: రాష్ట్ర ప్రజలకు సూపర్‌ సిక్స్‌ హామీలిచ్చి ఏ హామీనీ అ­మ­లు చేయకుండా స్థానిక ఎన్నిక­లలో సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్య­క్షు­డు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పి­న్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. మాచర్లలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి షేక్‌ సుల్తానా,  కౌన్సిలర్‌ అభ్యర్థులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తనపైనా, తన సోదరుడిపైనా పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారని, తాము 98 రోజులు జైలులో ఉన్నామని వివరించారు. స్థానిక ఎన్నికల్లో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులపై టీడీపీ మూకల దాడిని నిరసిస్తూ మాచర్లలో శాంతియుత ప్రదర్శన చేస్తే తిరిగి తన బెయిల్‌ రద్దు చేయాలని పోలీసులు గురజాల కోర్టులో కేసు వేసి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో టీడీపీ అరాచకాలకు వంతపాడుతున్న పోలీసులు, అధికారులపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్‌ వేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాచర్ల మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారపార్టీ అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 

వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్ధి సుల్తానాను పచ్చమూకలు బెదిరించారని ధ్వజమెత్తారు.  మహిళా కౌన్సిలర్‌ అభ్యర్థి రామతులసిపై గంజాయి బ్యాచ్, తెలుగుదేశం రౌడీలు, బ్లేడులు, కత్తులతో దాడికి పాల్పడి బీఫాం లాక్కున్నారని దుయ్యబట్టారు. ఇది అధికారులు, పోలీసుల ముందే జరిగినా చూసీచూడనట్టు వ్యవహరించారని విమర్శించారు. మున్సిపల్‌ కమిషనర్‌ కూడా టీడీపీ అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెడుతున్నారని పిన్నెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement