సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tributes to Sardar Vallabhbhai Patel on birth anniversary | Sakshi
Sakshi News home page

సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు వైఎస్‌ జగన్‌ నివాళి

Oct 31 2026 9:29 AM | Updated on Oct 31 2026 9:29 AM

YS Jagan Pays Tributes to Sardar Vallabhbhai Patel on birth anniversary

సాక్షి, తాడేపల్లి: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ జయంతి. ఈ సందర్భంగా పటేల్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు. పటేల్‌ దార్శనికత, సేవలు, ఆదర్శాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా..‘స్వాతంత్ర్యం అనంతరం సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్‌ది కీలక పాత్ర. దేశ సమైక్యత, సమగ్రతకు బలమైన పునాదులు వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. దృఢమైన నాయకత్వం, అచంచలమైన సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు. ఆయన దార్శనికత, సేవలు, ఆదర్శాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం’ అని పోస్టు చేశారు. 

ఇదీ చదవండి: రిటర్నింగ్‌ అధికారులా.. అధికారపార్టీ ఏజెంట్లా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement