పత్రికా స్వేచ్ఛపై దాడిని సహించం | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛపై దాడిని సహించం

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

● ఆత్మకూరు సాక్షి రిపోర్టర్‌ సుబ్బారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఏపీయూడబ్ల్యూజే ● జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు వినతిపత్రాలు అందజేత

గుంటూరు వెస్ట్‌: కర్నూలు జిల్లా ఆత్మకూరు రూరల్‌ సాక్షి దినపత్రిక విలేకరి సుబ్బారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడిని ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. శుక్రవారం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ నుంచి మీడియా ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ మీరా మాట్లాడుతూ సుబ్బారెడ్డిపై దాడి చేసిన దుండగులను వెంటనే గుర్తించి అరెస్ట్‌ చేయాలని కోరారు. సమాజంలో జర్నలిజం చేసే క్రమంలో కొన్ని పార్టీలు విలేకరులను టార్గెట్‌ చేయడం సరికాదన్నారు. కేవలం ఉపాధి కోసం మాత్రమే చాలా మంది రిపోర్టింగ్‌ చేస్తున్నారని చెప్పారు. సదరు రిపోర్టర్‌కు కూడా కుటుంబం ఉంటుందని గుర్తించాలని కోరారు. బాధితుడు సుబ్బారెడ్డికి తక్షణం వైద్య సాయంతోపాటు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి కె.రాంబాబు మాట్లాడుతూ ఎన్నికలు జరిగే ప్రతి సారి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రిపోర్టర్లపై దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికార పార్టీల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి సంస్కృతి సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ, ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు మీడియా ప్రతినిధులు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సాక్షి ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జి ఎన్‌.మాధవరెడ్డి, సిటీ కేబుల్‌ రిపోర్టర్‌ గిరి, ఏపీయూడబ్ల్యూజే నాయకులు కె.ఫణీంద్ర, వెంకయ్య, రామ్‌ ప్రసాద్‌, కె.శ్రీనివాసరావు, ప్రశాంత్‌, మల్లేశ్వరరావు, కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement