నర్సెస్‌ యూనియన్‌ జిల్లా కార్యవర్గానికి పలువురి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

నర్సెస్‌ యూనియన్‌ జిల్లా కార్యవర్గానికి పలువురి ఎంపిక

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

గుంటూరు మెడికల్‌: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ (ఏపీజీఎంఏ) గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లోని నర్సింగ్‌ యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు రాధమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు కోటమ్మ ఆధ్వర్యంలో కో ఆప్షన్‌ పద్ధతిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు. నాలుగు ఉపాధ్యక్ష పదవులకు ఎ.హేమలత, కళ్యాణి, సుధారాణి, ఫాతిమున్నిసాను, ఈసీ సభ్యురాలిగా శారదను కో ఆప్షన్‌ పద్ధతిలో నియమించారు. నూతనంగా ఎంపికై న వారు నేటి నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతారని నర్సుల సంఘం జిల్లా కార్యదర్శి పద్మజ తెలిపారు.

బాపట్ల అడహక్‌ కమిటీ ఏర్పాటు

బాపట్ల జిల్లా నర్సుల సంఘం నూతన కమిటి ఏర్పాటు చేసేందుకు అడహక్‌ కమిటి సభ్యులుగా ఐదుగురు సభ్యులను శుక్రవారం ఎంపిక చేశారు. గుంటూరు జీజీహెచ్‌లోని యూనియన్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతనంగా ఎన్నికై న అడహక్‌ కమిటి సభ్యులు సభ్యత్వాలు చేర్పించి, ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాధమ్మ, కోటమ్మ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement