తెనాలిరూరల్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.55 వేల జరిమానా, సహకరించిన అతడి తల్లికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలు.. పట్టణానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతుండగా ముత్తెంశెట్టిపాలేనికి చెందిన 25 ఏళ్ల గుమ్మడి శ్రీనుబాబు ప్రేమ పేరుతో పరిచయం అయ్యాడు. బాలికను రెండుసార్లు అతడి ఇంటికి తీసుకెళ్లి అతని తల్లి దుర్గకు పరిచయం చేయగా, తన కుమారుడిని పెళ్లి చేసుకోమని కోరింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను గుంటూరులోని పిన్ని ఇంటికి పంపారు. పరీక్షలు ఉండడంతో తెనాలి తీసుకురాగా 2022 జనవరి 6వ తేదీ తెల్లవారుజామున బాలికను శ్రీనుబాబు తన వెంట ఇంటికి తీసుకెళ్లాడు. అతడి తల్లి దుర్గ ఖర్చులకు డబ్బు ఇచ్చి ఎక్కడికై నా వెళ్లి పెళ్లి చేసుకోమని చెప్పి పంపించింది. బాలికను రైలులో హైదరాబాద్ తీసుకెళ్లిన శ్రీనుబాబు అక్కడి ఓ గుడిలో బాలిక మెడలో పసుపుతాడు కట్టి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. బాలిక వద్దని వారించిన ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టారని తల్లి ద్వారా తెలుసుకున్న శ్రీనుబాబు అదే నెల 20వ తేదీన బాలికను తీసుకువచ్చి ఆమె ఇంటి సమీపంలో వదిలి వెళ్లాడు. కేసును అప్పటి వన్ టౌన్ ఎస్‌ఐ కె.చాణక్య నమోదు చేయగా, అప్పటి డీఎస్పీ కె.స్రవంతిరాయ్ దర్యాప్తు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. కేసు శుక్రవారం విచారణకు రాగా, సాక్ష్యాధారాలను పరిశీలించి తెనాలి పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడు శ్రీనుబాబుకు 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.55 వేల జరిమానా, అతని తల్లికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా మొత్తం రూ. 57 వేలు బాలికకు ఇవ్వాలని, అలానే ప్రభుత్వం నెల రోజుల్లోగా బాలికకు రూ.ఐదు లక్షలు చెల్లించాలని ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలినేని రాఘవయ్య వాదించారు. హెబ్‌కానిస్టేబుళ్లు కె.సాంబశివరావు, కె.నరసింహారావు సహకరించారు.
సహకరించిన తల్లికి
మూడేళ్ల శిక్ష విధించిన
తెనాలి పోక్సో కోర్టు న్యాయమూర్తి


