నగరానికి మణిహారంగా దర్శనమిస్తున్న బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్లు(ఫైల్)
రాజధానికి ముఖద్వారం అంటూనే వెన్నుపోటు
నగర అభివృద్ధికి తట్టెడు మట్టి కూడా పోయని వైనం
రెండున్నరేళ్లుగా పలు ఈవెంట్‌లతోనే మేనేజ్
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలోనే ప్రగతి ప్రకాశం
మూడు ఫ్లై ఓవర్లు, రిటైనింగ్ వాల్‌తో పాటు కీలక అభివృద్ధి పనులు
కార్పొరేషన్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ
అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఒకప్పుడు విద్య, వైద్యం, వ్యాపార, వాణిజ్య, రవాణా, రైల్వే, రాజకీయ, ఉద్యమ, సాంçస్కతిక, సాహిత్య కేంద్రంగా ఉన్న విజయవాడ అభివృద్ధికి ఆమడ దూరాన నిలుస్తోంది. ఇదే కొనసాగితే విజయవాడ డెడ్ సిటీగా మారిపోతుందని మేధావులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పథకం ప్రకారమే విజయవాడను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకూ, మళ్లీ 2024 నుంచి ఇప్పటి వరకూ ‘అమరావతి’ అభివృద్ధి పేరుతో విజయవాడ భవిష్యత్తును పూర్తిగా పణంగా పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. దసరా వచ్చినప్పుడల్లా ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేయడం తప్ప నగర అభివృద్ధి కోసం ఒక తట్టెడు మట్టి కూడా కూటమి ప్రభుత్వం వేయలేదన్న విమర్శలున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: 15లక్షల 56వేల జనాభాతో రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న విజయవాడ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వివక్ష కారణంగా పురోగమనం నుంచి తిరోగమనం దిశగా పయనిస్తోంది. గ్రేటర్ విజయవాడ అని ఊదరగొట్టడమే తప్ప, నగర సమగ్ర అభివృద్ధికి చంద్రబాబు నిధులు కేటాయించడం లేదు. విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న మెట్రో రైలు (ప్రజారవాణా) ప్రాజెక్టుకు గత 12 ఏళ్లుగా ఒక్క రూపాయి విదల్చలేదు. దశాబ్దాలుగా వేధిస్తున్న వంతెనల సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బుడమేరు వరద ముంపుతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులైనా పట్టించుకోలేదు. ఆ ముంపు సహాయక చర్యలకు రూ.6,500కోట్లు కావాలని కేంద్రాన్ని కోరినా, నయా పైసా విడుదల కాలేదు. చిన్నపాటి వర్షాలకే నగరం ముంపునకు గురవుతోంది. 2015లోనే వరద కాలువల నిర్మాణానికి రూ. 461 కోట్లు కేటాయించినా ఆ నిధులను దారి మళ్లించేశారు.
యథేచ్ఛగా ఆస్తుల పంపకం..
గన్నవరం(విజయవాడ) విమానాశ్రయాన్ని విస్తరించారు. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని వారు నిరసన దీక్షలు చేస్తున్నారు. దాన్ని వదిలేసి ఇప్పుడు అమరావతిలో వేలాది ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కడతామంటున్నారు. నగర ఆస్తులను బడా కంపెనీలకు కట్టబెడుతున్నారు. పాత బస్టాండ్ స్థలాన్ని లులూ సంస్థకు కారు చౌకగా లీజుకు ఇస్తూ జీవోలు విడుదల చేశారు. అది తాత్కాలికంగా ఆగినా ప్రమాదం పొంచి ఉంది. భవానీ ఐల్యాండ్ ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చారు. విద్యాధరపురం ఆర్టీసీ డిపో విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు. డిస్నీ ల్యాండ్ 57ఎకరాల స్థలాన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన 673 జీవో ఆధారంగా మునిసిపల్ మార్కెట్లు, కాంప్లెక్సు క్రమంగా కూల్చుతున్నారు. ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారు.

బుడమేరు వరదలకు నీటమునిగిన సింగ్‌నగర్ ప్రాంతంలో జనాల అవస్థలు(ఫైల్)
తాగునీటికీ కటకటే..
కృష్ణానది పక్కనే ఉన్నా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయలేకపోవడంతో పదుల సంఖ్యలో డయేరియా మరణాలు, వందలమంది ఆసుపత్రుల పాలు అవ్వడం చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా జరుగుతూనే ఉంది. క్యాపిటల్ రీజియన్లో విజయవాడ భాగమైనప్పటికీ సీఆర్‌డీఏ విజయవాడ అభివృద్ధికి నిరి్ధష్ట ప్రణాళిక రూపొందించలేదు. నిధులు కేటాయించడం లేదు. విజయవాడ పరిధిలో ఒక్క నూతన ప్రాజెక్టు, పరిశ్రమ, సంస్థ ఏర్పాటు కాలేదు. మరోవైపు నగరపాలక సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఆస్తులు తాకట్టులోకి వెళ్తున్నాయి. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, వినోదపు పన్ను, వృత్తి పన్ను, మోటార్ వాహనాల పన్ను, తలసరి గ్రాంట్లు, స్టాంప్ డ్యూటీ, ప్రకటనలు పన్ను ఇలా దాదాపు రూ.1000కోట్లకు పైగా రాష్ట్రం నగర పాలకసంస్థకు బకాయి పడింది. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోవడమే కాకుండా కాంట్రాక్టర్లు బిల్లుల కోసం సమ్మెకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వెస్ట్ బైపాస్ రాగా ఈ ప్రభుత్వం రాగానే ఈస్ట్ బైపాస్‌ను రద్దు చేసింది.

న్యూ రాజరాజేశ్వరీపేటలో డయేరియా కారణంగా స్పృహ కోల్పోయిన మహిళను భుజాలపై ఆస్పత్రికి తరలిస్తున్న వ్యక్తి(ఫైల్)
వైఎస్సార్ సీపీకి ఎడ్జ్..
గత ఐదేళ్లపాటు మేయర్‌గా విజయవాడ నగరాభివృద్ధికి కృషి చేసిన బీసీ సామాజికవర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మిని వైఎస్సార్ సీపీ మళ్లీ పోటీలో నిలిపింది. తెలుగుదేశంపార్టీ నుంచి ఆఖరిలో పార్టీ మారి జనసేన తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధాకృష్ణ కూటమి అభ్యరి్థగా బరిలో దిగగా, వామపక్షాలు, కాంగ్రెస్ తరపున ఉమ్మడి అభ్యరి్థగా మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోటీ లో ఉన్నారు. ఈ త్రిముఖ పోటీలో వైఎస్సార్ సీపీ అభ్యర్థికే మెరుగైన అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయవాడ రాణీగారితోట వద్ద నిర్మించిన రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్కు(ఫైల్)
వైఎస్సార్ సీపీ పాలనలో ప్రగతి పరుగులు..
విజయవాడలో గత వైఎస్సార్ సీపీ పాలనలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయి. రోడ్ల నిర్మాణం నుంచి మురుగునీటి నిర్వహణ వరకు, పార్కుల అభివృద్ధి నుంచి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు వరకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతోపాటు క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిపైనా దృష్టి సారించారు. కనకదుర్గ గుడి ఫ్లై ఓవర్, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశారు. రూ.110కోట్లతో బెంజిసర్కిల్ వద్ద రెండో వైపు ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి, పూర్తి చేశారు. రూ. 370 కోట్లతో కృష్ణానది వరదల నుంచి నగర వాసులను రక్షించేందుకు రిటైనింగ్‌వాల్‌ను పూర్తి చేశారు.
దీనివల్ల 2024లో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నగర ప్రజలకు కొంచెం కూడా ఇబ్బంది కలగని పరిస్థితి వచ్చింది. కృష్ణమ్మ జలవిహారం పార్కు కోసం రూ. 12.5కోట్లు ఖర్చు చేశారు. పేద ప్రజల కోసం మూడు దశల్లో 90 వేల మందికి పట్టాలు ఇవ్వగా, 30వేల మందికి ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేశారు. రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ ఎయిర్‌పోర్టు కారిడార్ పనులను కూడా వైఎస్సార్ సీపీ హయాంలో పూర్తి చేశారు. నగరం నడి»ొడ్డులో 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహంతో స్మృతి వనం, అంబేడ్కర్ కళావేదికను కూడా నిర్మించారు. నైట్‌ఫుడ్ అందించే ఈట్‌స్ట్రీట్ ఆధునికీకరణ కూడా ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశారు.
రాచబాటలు.. సకల హంగులు..
నగరంలో 47.46కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.40.90 కోట్లు కేటాయించారు. మరో 4.33కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.6.80 కోట్లు కేటాయించారు. ఐదేళ్ల వ్యవధిలో నగరంలో వందకుపైగా పార్కులను అభివృద్ధి చేశారు. మినీ పార్కుల ఏర్పాటు, పాత పార్కుల ఆధునికీకరణ తోపాటు రాఘవయ్య పార్కు, గాం«దీహిల్ వంటి ప్రాంతాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 40 పార్కులలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు.
ప్రజారోగ్యానికీ ప్రాధాన్యం..
ప్రజలకు స్థానికంగానే ప్రాథమిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చారు. నగరంలో 11 కొత్త పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తయింది. యువతకు క్రీడా సదుపాయాలు కలి్పంచేందుకు నగరంలోని పలు క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి నిధు లు కేటాయించారు. చెన్నుపాటి రామకోటయ్య స్టేడియం అభివృద్ధికి రూ.8.9కోట్లు, దండమూడి రామ్మోహనరావు ఇండోర్ స్టేడియం అభివృద్ధికి రూ.4కోట్లు కేటాయించారు. మూడు స్విమ్మింగ్ పూల్స్ ఆధునికీకరణకు సుమారు రూ.4.19 కోట్లతో పనులు ప్రతిపాదించారు.


