సాక్షి, అమరావతి: అండమాన్ సముద్రం, నికోబార్ దీవులపై ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ఏపీ తీరం వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇదిలా ఉండగా, శుక్రవారం కోనసీమ జిల్లా నగరంలో 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 8.1, అనకాపల్లి జిల్లా చోడవరం 8, కాకినాడ జిల్లా వేలంగి 7.6., కృష్ణా జిల్లా మచిలీపట్నం 7.6, కోనసీమ జిల్లా మామిడికుదురు 5.4, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 5.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఇదీ చదవండి: ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం


