IMD Rain Alert
-
ఏపీలో భారీ వర్షం.. ఈ జిల్లాల ప్రజలకు విపత్తుల శాఖ హెచ్చరిక
సాక్షి, ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకూ.. ఒక బలమైన ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై కూడా కనిపిస్తోంది. ఈ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన కారణంగా పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం దగ్గర రోడ్డుపై భారీ వృక్షం విరిగిపడింది. రోడ్డుపై చెట్టు పడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో, పిడుగురాళ్ల -సత్తెనపల్లి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. చెట్టు తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు.రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు , శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు, pic.twitter.com/0sPdSsATQK— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 1, 2025మరోవైపు.. ప్రకాశం జిల్లాలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. కనిగిరిలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం పడుతోంది. ఇక, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు.. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణలో మరో ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయి. అలాగే.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కోసారి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.ఐఎండీ ప్రకారం నేడు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటూ.. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో కొంత భాగం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం నుంచి ఏపీలోకి గాలులు బలంగా వస్తున్నాయి. ఈ రోజంతా ఈ పరిస్థితి ఉంటుంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షం కురుస్తోంది. దీంతో, రోడ్లన్నీ జలమయమయ్యాయి. -
24 నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి తుపాను ముప్పు పెద్దగా లేకపోయినా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో సోమవారం తెల్లవారుజామున ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడిందని, ఇది పశి్చమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారానికి వాయుగుండంగా, బుధవారానికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి గురువారం ఉదయానికి ఒడిశా–పశి్చమ బెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఇది తీవ్ర తుపానుగా ఉత్తర ఒడిశా, పశి్చమ బెంగాల్ తీరాల సమీపంలో పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.తుపాను సన్నద్ధతపై సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇందులో ఏపీ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. నేవీ అధికారులతో సమన్వయం చేసుకుని సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించినట్లు తెలిపారు. -
తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు
చెన్నై:తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తమిళనాడు డెల్టాప్రాంతంలో ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై,పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.పుదుచ్చేరిలో ప్రభుత్వాస్పత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పేషెంట్లను మరో ఆస్పత్రికి అధికారులు తరలించారు. వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి చెన్నై,పుదుచ్చేరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడు సేలం జిల్లాలో సబ్వేలో వరద నీరు నిలిచింది.ఇదీ చదవండి: మురసోలి సెల్వమ్ కన్నుమూత -
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రానున్న 24 గంట్లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను మరోసారి వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు(గురువారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే, ఉత్తరాంధ్రలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ విధించింది.ఇదే సమయంలో విజయవాడకు మరో ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 24 గంటల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, పలు ప్రాంతాల్లో 7-12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానున్నట్టు అంచనావేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. -
బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం...
-
Updates: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
Telangana & Hyderabad Heavy Rains Alert Updatesరాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల మళ్లీ భారీ వర్షం ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, టోలిచౌకీ, లంగర్‌హౌజ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్టలో భారీ వర్షం కుండపోత వానతో రోడ్లపై వాహనదారుల ఇబ్బందులుఅప్రమత్తమైన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు మంగళ, బుధ వారాల్లో భారీ వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. హుస్సేన్‌సాగర్‌కు పెరిగిన నీటి మట్టంఉదయం 8గం. వరకు 513.55 మీటర్ల నీటి మట్టంఇన్ఫ్లో 1,850 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,600 క్యూసెక్కులుఅప్రమత్తమైన అధికారులుఎల్బీ స్టేడియం వద్ద కూలిన గోడరాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ స్టేడియం వద్ద నేల కూలిన భారీ వృక్షంచెట్టు పడిపోవడంతో కూలిన ప్రహారీ గోడపలు పోలీసు వాహనాలు ధ్వంసంబషీర్బాగ్ సీసీఎస్ పాత కార్యాలయం వద్ద ఘటనహైదరాబాద్కు రెడ్ అలర్ట్నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది జీహెచ్ఎంసీమరోసారి కుండపోత వాన కురుస్తుందని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరించిందిప్రధాన కూడళ్లలో మోకాల కంటే పైన నీరు పేరుకుపోయిందికాలనీలు, బస్తీలు చెరువుల్లా మారిపోయాయివాటర్ లాగిన పాయింట్ల వద్ద నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తున్నారుఅత్యవసర సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు 040-21111111, 9000113667 సంప్రదించాలని జీహెచ్ఎంసీ కోరుతోంది.హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొర్లడంతో పాటు పలు కాలనీలు, రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జంట నగరాల్లో ఈ వేకువ జాము నుంచి ఉరుములు, పిడుగులతో కుండపోత కురుస్తోంది. మరో నాలుగు రోజులపాటు ఇలాంటి పరిస్థితి తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.హైదరాబాద్‌లో రామ్ నగర్లో భారీ వర్షానికి ఒకరు మృతి చెందారు. ఒక్కసారిగా రోడ్డు మీద నీరు పెరిగిపోవడంతో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి.. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పార్శి గుట్ట నుంచి రామ్ నగర్‌కు మృతదేహం కొట్టకు వచ్చింది. మృతి చెందిన వ్యక్తిని రామ్ నగర్‌కు చెందిన అనిల్‌గా గుర్తించారు. మరోవైపు.. రోడ్లపై భారీ నీరు పేరుకుపోవడంతో.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని నగరవాసులకు జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను బయటకు రానివ్వొద్దని అధికారులు కోరుతున్నారు. నగరంలో పలు అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. బైకులు, కార్లు కొట్టకుపోయాయి. దిల్సుఖ్నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం.. మంగళవారం వేకువజామును మరోసారి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధప్రతిపాదికన చర్యల్లో పాల్గొంటున్నాయి. వర్ష బీభత్సం.. హైలెట్స్నీట మునిగిన బస్తీలు, కాలనీలుకొట్టుకుపోయిన కార్లు, బైకులురామ్, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీల్లో నడుం అంచు వరకు నీరుప్రమాదం అంచుల్లో పార్సిగుట్టలోని పలు పప్రాంతాలుజంట నగరాల్లోని ప్రధాన రోడ్లపై ఉధృతంగా నీరు.. పంజాగుట్ట, లక్డీకాపూల్‌లో మోకాల లోతు దాకా నీరుహైటెక్ సిటీ దగ్గర చెరువును తలపిస్తున్న రోడ్లురాకపోకలకు అవాంతంర.. వాహనదారులకు ఇబ్బందులుచాలా చోట్ల 10 సెం.మీ. లకు పైగా వర్షపాతం నమోదు అయ్యిందియూసఫ్గూఢలో అత్యధికంగా 11 సెం.మీ. వర్షం పడింది Heavy rain 🌨️in many areas of hyderabad⚡ , Stay home and be safe.🏊🏊#HyderabadRains #Hyderabad#HyderabadRains #Hyderabad pic.twitter.com/ghaon2UJRg— Tabrez Alam (@Tabrez_saab) August 20, 2024మరోవైపు.. తెలంగాణ అంతటా ఇంకో నాలుగు రోజులు భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జనగామ, గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, సిద్ధిపేట, వనపర్తికి ఐఎండీ వర్ష సూచన చేసింది.రంగారెడ్డి,సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడొచ్చని హెచ్చరించింది.ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.Heavy in Hyderabad. The roads are flooded and people are facing of problems 🌨️🌨️🌨️🌨️#HyderabadRains #earthquake pic.twitter.com/u82iTtn7rt— Vandana Meena (@vannumeena0) August 20, 2024 -
తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్.. హైదరాబాద్ ముంచెత్తిన జడివాన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని గురువారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ తో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.మరోవైపు.. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇదిలా ఉంటే.. మూడురోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతతో ఉక్కపోతతో చంపేస్తున్న హైదరాబాద్ వాతావరణం.. హఠాత్తుగా మారిపోయింది. శుక్రవారం నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మేఘం విరిగిపడిందా? అన్నట్లు వాన కురిసింది. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్.. చుట్టుపక్కల ఏరియాల్లో భారీ వాన పడింది. క్యూములోనింబస్ మేఘాలు ముసురుకోవడంతో.. ఒక్కసారిగా ఈ పరిస్థితి నెలకొంది. సెలవు రోజు కావడంతో ట్రాఫిక్ చిక్కులు పెద్దగా లేకపోయినా రోడ్లపై నీరు పేరుకుపోవడంతో నగర వాసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.Heavy heavy Rain in Ameerpet...#Hyderabadrains #Hyderabad pic.twitter.com/5TUtwQGcyt— Srinu Nattu vidyam (@srinu18_srinu) August 15, 2024 UCHAKOTHA RAINS ⚠️The heaviest rainfall of this season is now ramping across Hyderabad. This will turn into PAN HYDERABAD SHOW now next 30min. Please stay alert Hyderabad. This will reduce only after 8/8.30pm. Take care of your parked viechles. This is not an ordinary storm…— Telangana Weatherman (@balaji25_t) August 15, 2024 #PragathiNagar getting lashed by a heavy spell of rain@balaji25_t @HYDmeterologist @Rajani_Weather @HiHyderabad #Telanganarains #Telangana #Hyderabad #Monsoon2024 pic.twitter.com/np0EpDkFMD— Indraja M (@IndrajaBellam19) August 15, 2024హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. చుట్టుపక్కల జిల్లాలకు కూడా అదే అలర్ట్ ఇచ్చింది. సంగారెడ్డిలో ఎడతెరిపి లేకుండా భారీ వాన పడుతోంది. గుమ్మడిదలలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షం పడింది. బీరంగూడ, అమీన్పూర, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, కిష్ణారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. -
బిగ్ అలర్ట్.. ఈ తెలంగాణ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో రెండ్రోజులపాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు రాజధాని హైదరాబాద్‌ను కూడా భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉందని తెలిపింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు నుంచి మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఆ పది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇక ఇవాళ(శనివారం) సాయంత్రం హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ తాజా ప్రకటనతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. -
ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంపైన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. సోమవారం రాష్ట్రంలో సగటున 1.85 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో సగటున 4.39 సెం.మీ. వర్షం కురవగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.33 సెం.మీ. వికారాబాద్ జిల్లాల్లో 4.16 సెం.మీ., మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4.04 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. -
పూర్తిస్థాయిలో విస్తరించిన రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. దేశవ్యాప్తంగానూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈనెల 8వ తేదీ నాటికి దేశమంతటా నైరుతి విస్తరించాల్సి ఉండగా.. వేగంగా కదిలిన నేపథ్యంలో వారం రోజులు ముందుగానే విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ క్రమంగా వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంపై పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
బంగాళాఖాతంలో ఆవర్తనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి. అనేకచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సోమవారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, మంగళవారం అల్లూరి, శ్రీసత్యసాయి, వైఎస్సార్, తిరుపతి, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కాకినాడలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
15 నుంచి విస్తారంగా వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొద్ది రోజుల నుంచి నైరుతి రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. ప్రస్తుతం షీర్ జోన్, గాలుల కోత కారణంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. అదే సమయంలో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, ఒడిశా, వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఫలితంగా ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కాగా గురు, శుక్రవారాల్లో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు అక్కడక్కడ పిడుగులు పడతాయని వివరించింది. బుధవారం రాయలసీమలో కొన్నిచోట్ల భారీగా, పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. సిద్ధాపురం (కర్నూలు) 5.1, వ్యాసపురం (అనంతపురం) 5.0, కూచినపూడి (బాపట్ల) 3.8, మారాల (శ్రీసత్యసాయి) 2.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
మూడు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉన్నాయి. నాలుగు రోజులుగా అక్కడక్కడా తేలికపాటి వానలు, జల్లులు పడుతుండగా... మంగళ, బుధ, గురువారాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రుతుపవనాలు రాష్ట్రం మీదుగా సోమవారం మహారాష్ట్రలోని నాసిక్, సుకుమా తదితర ప్రాంతాలకు సైతం విస్తరించాయి. దీంతో అటు దక్షిణ మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపింది. యాదాద్రి–భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ్‌పేట, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదవుతాయని హెచ్చరించింది. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెల్ప్ డెస్క్ (ఫోన్ నంబర్లు: 040–21111111, 9001136675)ను ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 40.4 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.4 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. -
తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్‌కు కుంభవృష్టి హెచ్చరిక!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల మాత్రం ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే.. రాజధాని హైదరాబాద్ నగరంలో కుంభవృష్టి తప్పదని హెచ్చరిస్తూ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అధికార యంత్రాంగం వరుణ గండాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణకేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది.నాలుగు రోజులు ఇలా.. 🌧️గురువారం(నేడు) ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.🌧️శుక్రవారం రోజున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉంది. 🌧️19, 20న తేదీల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. 🌧️వాతావరణ శాఖ అంచనాల ప్రకారమే.. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది. -
నేడు, రేపు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.1 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని ప్రణాళికా శాఖ వివరించింది.తగ్గిన గరిష్ట ఉష్ణోగ్రతలు: తేలికపాటి వర్షాల నేపథ్యంలో గురువారం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా జకొరలో 43.6 డిగ్రీలు, సలూరలో 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రానున్న వారం రోజులపాటు సాధారణం నుంచి కాస్త తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్పింది.వడగాడ్పులకు బ్రేక్...: ప్రస్తుత వేసవి సీజన్లో వడగాడ్పులకు బ్రేక్ పడినట్లు వాతావరణ నిపుణు లు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం కేవలంపశ్చిమ రాజస్తాన్‌లోనే వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ తెలిపారు. బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన బలమైన గా లులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఉరుము లతో కూడిన గాలివానలు పెరుగుతాయని చెప్పారు. అయితే భారీ వర్షాలకు మాత్రం ఆస్కారం లేదని, దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు వివరించారు. -
రెండ్రోజులు మోస్తరు వానలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వివరించింది. బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.24 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని ప్రణాళికా విభాగం వివరించింది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సగటున 4.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హైదరాబాద్ జిల్లాలో సగటున 4.42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ, ములుగు జిల్లాల్లో సగటున 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాచుపల్లిలో 10.8 సెంటీమీటర్లు, ఆ తర్వాత శేరిలింగంపల్లిలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జకొరలో 42.9 డిగ్రీల సెల్సియస్మంగళవారం, బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురవడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదయ్యాయి. అధికంగా నిజామాబాద్ జిల్లా జకొరలో 42.9 డిగ్రీల సెల్సియస్, కొరట్పల్లిలో 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి కాస్త తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కొన్నిచోట్ల సాధారణం కంటే అధికంగా నమోదవు తాయని వాతావరణ శాఖ సూచించింది. -
తెలంగాణకు వర్ష సూచన.. 10 రోజుల పాటు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. వచ్చే పది రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి.. పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తర్వాత ఎండ తీవ్రత పెరిగే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. కాగా, వర్షాల కారణంగా తగ మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త పడిపోయాయి. వచ్చే పది రోజులపాటు అంటే.. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 25 వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అంచనా వేసింది. రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది. మరో ఐదురోజులపాటు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు గురు, శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చిరు జల్లులు.. చినుకుల్లో తడిచిన జనం (ఫోటోలు)
-
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబరు అందించింది. తెలంగాణ, ఏపీలో రెండు రోజుల పాటు అక్కడకక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. శని, ఆదివారాల్లో పలు చోట్లు వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. Clouds are forming the border of Telangana, Andhra ,chhattisgarh and orrisa with increase in some heat result in some good isolated spell over these areas in the coming 2 days. #Rains pic.twitter.com/Uqcwd397d5 — SadhuWeatherman (@abhiramsirapar2) February 23, 2024 -
తెలంగాణలో రెండ్రోజులు అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మిచౌంగ్ Cyclone Michaung ప్రభావంతో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను కదలిక ఆధారంగా తాజాగా ఈ అప్డేట్ను అందించింది. దీంతో ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోని పలు జిల్లాలో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం పడుతోంది. వర్షం కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. మంగళ(నేడు), బుధవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే గురువారం కూడా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వానలు పడొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మిచౌంగ్ ప్రభావ దృష్ట్యా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎస్ శాంతికుమారి సూచించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సి.ఎస్ శాంతి కుమారి సూచించారు. ఇదీ చదవండి: తీవ్ర తుపాను మిచౌంగ్ ముంచేసింది -
తెలంగాణకు అలర్ట్.. ఐదు రోజులు భారీ వర్షాలే..
సాక్షి, హైదరాబాద్: గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు నిండి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో వచ్చే ఐదురోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నుంచి కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. నేటిం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ♦️ తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.#WeatherForecast #rains #Telangana #weatheralert pic.twitter.com/NrIupV9JqF — DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) September 12, 2023 ఏపీకి వర్ష సూచన.. ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలోని మధ్య భాగాలకు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. మరోవైపు నైరుతి ఉత్తరప్రదేశ్ నుంచి ఉపరితల ఆవర్తనం ప్రాంతం వరకు మరో ద్రోణి పయనిస్తోంది. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు ఉత్తరకోస్తాలో అనేకచోట్ల, దక్షిణకోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది కూడా చదవండి: ఆఫ్రికాకు ప్రకృతి శాపం! నాలుగు రోజుల గ్యాప్‌లో 6వేల మంది మృతి! -
రెండురోజుల్లో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: మయన్మార్ తీరానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మరోవైపు వాయవ్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర సముద్రతీర ప్రాంతాల వరకు, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్ అంతర్భాగంగా తూర్పు–పడమర ద్రోణి సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ఫలితంగా రానున్న మూడురోజులు కోస్తాంధ్రలో అనేకచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి వరకు విజయనగరం, కోనసీమ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. ఇది కూడా చదవండి: టమాటా రైతుకు బాసట.. -
HYD: అత్యవసరమైతేనే బయటకు రావాలి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ సూచనలు, రేపటి వరకు అతిభారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జోనల్ కమిషనర్లతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారామె. లోతట్టు ప్రాంతాల్లో అస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులను ఆదేశించారు. అలాగే.. పోలీస్, జీహెచ్ఎంసీ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రేపటి వరకు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని. దీంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారామె. ► ప్రజలు అత్యవసరం పని ఉంటేనే బయటి రావాలని తెలిపారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలయాలు గేట్లు ఎత్తి వేసిన నేపథ్యంలో మూసి నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. హెల్ప్ లైన్ కు వచ్చిన పిర్యాదులకు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు మేయర్ సూచించారు. ఇప్పటికే నగరం, శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి.. దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు. లోతట్టు ప్రజల్ని అప్రమత్తం చేయండి భారీ వర్షాలకు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ సూచించారు. జంట జలాశయాల గేట్లు తెరిచినందున మూసీ పరివాహక ప్రాంతాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారుల్ని కోరారాయన. ప్రజలు కూడా ఏదైనా సమస్య ఎదురైతే జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-2111 1111 డయల్ 100 ఈవీడీఎం కంట్రోల్ రూం నెంబర్ 9000113667 ► మరోవైపు మంత్రి తలసాని సైతం హైదరాబాద్ వర్ష పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూడాలని, కూలిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని, హుస్సేన్‌సాగర్.. ఉస్మాన్ సాగర్ నీటి స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రత్యేకించి నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపైనా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను సంప్రదించాలని ప్రజలను కోరారు. ► ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. వీలును బట్టి వర్క్‌ఫ్రమ్ చేసుకోవాలని సూచించారు. అలాగే.. ఆఫీస్‌లకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ రద్దీ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. -
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్/విశాఖ: ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం రేపటి కల్లా బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ క్రమంలో.. మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది వాతావరణ శాఖ. తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌కు భారీ వర్షసూచన చేయడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ► తెలంగాణలో.. నిన్నటి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్‌లో వాగులు పొంగిపొర్లి.. పలు గ్రామాలకు రాకపోకలకు స్తంభించాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో.. రెండు గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. MASSIVE DOWNPOURS triggering in Nirmal, Nizamabad, Jagitial belt to cover Kamareddy, Sircilla, Karimnagar, Sangareddy, Medak, Siddipet in coming 2hrs Chances looks highly favourable for morning rains in HYD. Will continue to update. Better prefer public transport this morning — Telangana Weatherman (@balaji25_t) September 4, 2023 ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను.. మళ్లీ వర్షాలు ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. ఈ ఉదయం నుంచి ఆదిలాబాద్ కేంద్రంలో భారీ వాన కురుస్తుండగా.. రోడ్లు జలమయం అయ్యాయి. ఇప్పటికే రాకపోకలు నిలిచిపోగా.. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ► భూపాలపల్లిలోనూ నిన్నటి నుంచి వాన కురుస్తుండడంతో.. ఓపెన్ కాస్ట్ పనులకు అంతరాయం కలుగుతోంది. ► నిజామాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. డిచ్‌పల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. ► ఉమ్మడి మెదక్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. గరిష్టంగా 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో.. రేపు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బలంగా గాలులు వీస్తాయని, ఎల్లుండి సైతం భారీ వానలు ఉంటాయని అప్రమత్తం చేస్తోంది. కర్నూలు: జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక వర్షం నేపథ్యంలో.. రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయయి. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో(సెప్టెంబర్ 4 వ తేది) కర్నూల్ APSP 2 వ బెటాలియన్ లో సోమవారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 21 తేదికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద పెరుగుతోంది. ఇన్ ఫ్లో 13,897 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 2,774 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 17.610 టీఎంసీలు కాగా.. జలాశయం పూర్తి కెపాసిటీ 78 టీఎంసీలు. అనంతపురం: తాడిపత్రిలో భారీ వర్షం కురుస్తోంది. పలు వాగులు వంకలు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. -
Weather Update: వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణలో మూడు రోజులు గట్టి వానలే!
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వర్షం కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. అయితే, తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భువనగిరి, మహబూబ్‌నగర్, హన్మకొండ, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. Weather update #Telangana Scattered thunderstorms rains Nirmal asifabad mancherial Jagtial peddapalli karimnagar siddipet Bhongir mahabubnagar Hnk Bhadradri sangareddy rangareddy places see good rains for next 1 hour ⛈️⛈️⛈️⚠️ pic.twitter.com/FGR2Ub938X — Telangana state Weatherman (@ts_weather) September 2, 2023 ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అతి భారీ వర్ష సూచన.. సోమవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఇది కూడా చదవండి: కొత్తవి ఇవ్వరు..పాతవాటిలో చేర్చరు -
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక, అల్ప పీడనం ప్రభావకంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, తెలంగాణలో మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇది కూడా చదవండి: చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత -
హైదరాబాద్‌లో ఈ ఏరియాలకు అలర్ట్
హైదరాబాద్: రెడ్ అలర్ట్‌కు కొనసాగింపుగా తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది ప్రభుత్వం. అలాగే.. ఆఫీసులు, కంపెనీలు సైతం నిర్ణీత సమయాల్లో బంద్ కావడం మంచిదని.. రైతులూ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్‌కు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది Hyderabad Rains వాతావరణ శాఖ. ఈ క్రమంలో జోన్ల వారీగా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది జీహెచ్ఎంసీ. నగరంలో.. చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఎల్బీనగర్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కూకట్పల్లి జోన్‌కు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటలో 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే సూచనలున్నాయని, కొన్నిచోట్ల 5 నుంచి 10 సెం.మీ. కూడా కావచ్చని వెల్లడించింది. భారీగా గాలులు వీస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో నాలల కెపాసిటీ 2 నుంచి 3 సెం.మీ. వర్షాన్ని తట్టుకునేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో.. అంచనాకి తగట్లు గనుక వాన పడితే.. రోడ్లపైకి భారీగా వరద చేరుకునే ఛాన్స్ ఉంది. మోస్తరు వాన పడింది.. సోమవారంతో పోలిస్తే.. మంగళవారం వరుణుడు కాస్త శాంతించాడు. నగరంలో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. ఒక చోట మోస్తరు వాన పడగా, మరోచోట భారీగా కురిసింది. ఆసిఫ్‌నగర్‌లో 43.5 మి.మీ., టోలిచౌకిలో 19.8 మి.మీ. వర్షం పడినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీ(టీఎస్‌డీపీఎస్) వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో 10 మి.మీ.లోపే పడింది. ఇలా జరగొచ్చు.. జాగ్రత్త! భారీ నుంచి అతి భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమవుతాయి. గాలులతో చెట్లు నేలకూలే ప్రమాదం ఉంది. విద్యుత్తు స్తంభాలు దెబ్బతినడం, కరెంటు సరఫరాలో అంతరాయాలకు అవకాశం. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవచ్చు. రేపు ఇలా.. ఐదు జోన్ల పరిధిలో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వీటి పరిధిలో గురువారం మోస్తరు నుంచి కొన్నిసార్లు భారీ వర్షం కురియవచ్చు. ఇక.. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉండవచ్చని వెల్లడించింది. గంటలో 2 నుంచి 3 లేదా 5 సెం.మీ. దాకా వర్షపాతానికి వీలుందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ వర్షాలపై నగర పౌరులకు ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా అలర్ట్ సందేశాలు అధికారులు పంపుతున్న సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వాతావరణ శాఖ హెచ్చరికలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
సాక్షి, బెంగళూరు: వారం నుంచి వదలని వానలతో కర్ణాటకలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో రేపు (జులై 26న) రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోనూ వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈక్రమంలోనే అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వయనాడ్, కోజీకోడ్, కన్నూర్, మళప్పురం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు మూసి ఉంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు ఇప్పటికే సెలవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. (షాకింగ్ వీడియో.. గ్రేటర్ నోయిడాలో నీట మునిగిన 200కు పైగా కార్లు) తెరిపినివ్వని వర్షం కారణంగా కాసర్గాడ్ జిల్లాలోని వెళ్లరికుందు, హోస్దుర్గ్ తాలుకాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, వానలు, వరదల కారణంగా కేరళలలో ముగ్గురు ప్రాణాలు విడిచినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇడుక్కి, వయనాడ్, కాసర్గాడ్ జిల్లాలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. పలు చోట్ల చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయని, భారీ వృక్షాలు ఉన్న చోట్ల జనం జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. కాగా, జులై 27 వరకు దక్షిణ భారతానికి భారీగా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఏపీలో ఐదురోజులపాటు భారీ వర్షాలు..రేపు.. ఎల్లుండి ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు) -
ఏపీలో ఐదురోజులపాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ నెల 26వ తేదీన వాయిగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తం చేస్తోంది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరో ఐదురోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సైతం ధృవీకరించింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏర్పడందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. ఆతర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని వెల్లడించారాయన. బుధవారం అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, గురువారం భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు. బుధవారం.. కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,పల్నాడు,బాపట్ల,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గురువారం.. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు. సోమవారం నాటికి ఇలా.. రాత్రి 7 గంటల నాటికి జిల్లా వారీగా విశాఖ జిల్లా ఆనందపురంలో 96 మి.మీ, పెందుర్తి 84, పద్మనాభం 76 మి.మీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ లో 61.5మి.మీ ,అల్లూరి జిల్లా అనంతగిరిలో 61.5 మి.మీ , శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట 56.5 మి.మీ, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 55.7 మి.మీ, నెల్లూరుజిల్లా అనుమసముద్రంపేటలో 55.5 మి.మీ, అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 49.7 మి.మీ, మన్యంజిల్లా సాలూరులో 47.5 మి.మీ అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. గోదావరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సోమవరం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 36.3 అడుగులు, పొలవరం వద్ద నీటిమట్టం 11.8 మీటర్లు ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.12 లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం కూనవరం ,పి.గన్నవరంలో 2ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మామిడికుదురు, అయినవిల్లి, కుకునూర్, వేలేర్పాడులో 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు. వరద ఉధృతి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.