తెలంగాణకు భారీ వర్ష సూచన.. 17 జిల్లాలకు అలర్ట్‌ | Heavy Rains Forecast To Telangana, IMD Warns Of Continued Showers In 17 Districts, Check Out Weather Report Inside | Sakshi
Sakshi News home page

తెలంగాణకు భారీ వర్ష సూచన.. 17 జిల్లాలకు అలర్ట్‌

Oct 13 2025 10:14 AM | Updated on Oct 13 2025 10:45 AM

Very Heavy Rain Forecast To Telangana Many Districts

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో(Telangana Rains) మళ్లీ వర్షాలు ఊపందుకున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రెండు గంటల్లో యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు..

కాగా, ఉత్తర భారత్​ నుంచి ప్రారంభమైన నైరుతి రుతుపవనాల నిష్క్రమణ తెలంగాణ ప్రాంతానికి చేరుకుంది. మే నెలాఖరు నాటికి దక్షిణ భారతదేశాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు సెప్టెంబరు 20వ తేదీ నాటికి ఉత్తర భారతదేశానికి పూర్తి స్థాయిలో చేరుకున్నాయి. 24వ తేదీ నుంచి రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. దీంతో, దాదాపు 17 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement