Cyclone Montha.. మోంథా తుపాను ప్రభావంతో దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొన్ని గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. రానున్న కొన్ని గంటల్లో ఏపీలోని తీవ్ర ప్రాంతాలు, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భా ప్రాంతాల్లో తక్కువ నుండి మధ్యస్థ స్థాయి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలకు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని తెలిపింది. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గరకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోవాలి. రైతులు పంటను, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని తెలిపింది. IMD, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాటించాలని సూచనలు చేసింది.
హెచ్చరిక జారీ చేసిన జిల్లాలు ఇవే..
ఏపీలో.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, యానం, గుంటూరు, ప్రకాశం జిల్లాలు.
తెలంగాణలో.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలు.
మహారాష్ట్రలో.. మరఠ్వాడ సమీప ప్రాంతాలు, నాందేడ్, హింగోలి, పర్బణీ, బుల్దానా, అకొలా, అమరావతి, వార్ధా, యవత్మాల్, నాగపూర్ జిల్లాలు.
Weather warning ⚠️ #Telangana
Now I'm warning once again for North East Central TG see heavy during next 24 hours stay safe 🚨
Flash floods possible 🌧️🌀⚠️ https://t.co/5PvVp8klDy— Warangal Weatherman (@tharun25_t) October 29, 2025



