ఆటవిడుపు
మెస్సీ రాక.. మెస్సీ రాక.. ఇది గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. మెస్సీ హైదరాబాద్‌కు రానున్న తరుణంలో ఇది ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అదే సమయంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో సీఎం రేవంత్ మ్యాచ్. ఇదే కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. వీరిద్దరి ఆటవిడుపు గురించి సరదాగా మాట్లాడుకుంటే..
మెస్సీతో మ్యాచ్‌ను సీఎం రేవంత్ తేలిగ్గా తీసుకోవడం లేదు. అందుకే ఆయన తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌ను చేస్తూ బిజిబిజీగా గడుపుతున్నారు రేవంత్. అందుకోసం యూనివర్శిటీకి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులతో తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. మెస్సీ మొత్తంగా స్టేడియంలో ఉండే సమయం 20 నిమిషాలే. అందులో సీఎం రేవంత్‌తో ఐదు నిమిషాల పాటు మ్యాచ్ ఆడతారు.
అయినప్పటికీ దీన్ని సీఎం రేవంత్ సరదాగా తీసుకోవడం లేదు. సీరియస్‌గానే తీసుకున్నట్లున్నారు. అందుకోసమే ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ఇక్కడ స్థానిక ఫుట్‌బాల్ క్రీడాకారులకు సీఎం రేవంత్ దీటుగానే బదులిస్తూ తన కిక్‌లతో అలరిస్తున్నారు. అంతే కాకుండా తన పాస్‌లతో కూడా ఆకట్టుకుంటున్నారు రేవంత్.
అదే జోరు కొనసాగేనా..?
నేటి ఐదు నిమిషాల మెస్సీతో మ్యాచ్‌లో రేవంత్ జోరు కొనసాగిస్తారా..? అనేది చూడాలి. రాష్ట్ర ఫుట్‌బాల్ ప్లేయర్లను పరుగులు పెట్టించిన రేవంత్.. మెస్సీని ఎంతవరకూ ధీటుగా ఎదుర్కొంటారో చూడాలి. మెస్సీతో గేమ్ అంటే మామూలు కాదు.. ఆ విషయం రేవంత్‌కు తెలుసు. అందుకే అంత ప్రాక్టీస్ చేశారు రేవంత్,.
ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం టెక్నికల్‌గా పుంజుకుని మరీ తన వార్మప్ మ్యాచ్‌లను కొనసాగించారు రేవంత్. ఒకవేళ పొరపాటను మెస్సీతో గేమ్‌లో రేవంత్ పైచేయి సాధించారంటే ఏమవుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. చాలా స్పల్ప సమయం పాటు జరిగే మ్యాచ్ కాబట్టి పెద్దగా అంచనాలు ఉండకపోవచ్చు. కానీ ఆ ఐదు నిమిషాల్లోనే రేవంత్ అద్భుతం చేసి మెస్సీని ఆశ్చర్యపరుస్తాడా? అనేది ఫుట్‌బాల్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న.


