అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతోంది. మరి కాసేపటిలో హైదరాబాద్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్త నెలకొన్ని నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియంతో పాటు మెస్సీ ప్రయాణించే మార్గాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్‌పై ఓ లుక్కేద్దాం.
హైదరాబాద్‌లో మెస్సీ షెడ్యూల్
కోల్‌కతా నుంచి మెస్సీ 4 గంటల సమయంలో హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నాడు. శంషాబాద్ విమానశ్రాయం నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గోనున్నాడు. అనంతరం హోటల్లో విశ్రాంతి తీసుకోన్నాడు.
👉ఆ తర్వాత సాయంత్రం 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు.
👉7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభం కానుంది.
👉8:6 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిచ్‌పైకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
👉8:6 నిమిషాలకు మెస్సీ ఎంట్రీ ఉండనుంది.
👉8:8 నిమిషాలకు మెస్సీ సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
👉 8:10 నిమిషాలకు హార్డ్ స్టాప్ ఉండనుంది
👉8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్
👉8:15 నిమిషాలకు పిల్లలతో కలిసి మెస్సీ గ్రూపు ఫోటో దిగనున్నాడు.
👉8:18 నిమిషాలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైదానంలో రానున్నారు.
👉8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కలిసి పరేడ్ వాక్‌లో పాల్గోనున్నారు.
👉రాత్రి 9 గంటల సమయంలో మెస్సీకి సన్మానం చేయనున్నారు.
👉ఆ తర్వాత మెస్సీ హైదరాబాద్ నుంచి వెళ్లిపోనున్నాడు.
చదవండి: IND vs SA: 'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు'


