
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు (Rain Update) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక, హైదరాబాద్ నగరంలో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

ఇక సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపెల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఇక, శనివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

Overnight INTENSE THUNDERSTORMS lashed North TG districts, overall, 4th consecutive day of POWERFUL THUNDERSTORMS in many parts of Telangana
Hyderabad too got decent rains yesterday. Will share today's forecast soon ⛈️👍 pic.twitter.com/tJeTJEy6rm— Telangana Weatherman (@balaji25_t) September 14, 2025