నల్గొండ జిల్లా: నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అయితగోని మధు గౌడ్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి, 439 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతూ యువ నాయకుడిగా తన సత్తాను చాటుకున్నారు.
కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ గ్రామాభివృద్ధి, ప్రజాసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న మధు గౌడ్‌కు ఈ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించారు. దీంతో ప్రజల కోరిక మేరకు రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన, ఇంటింటి ప్రచారం చేస్తూ గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.
యువత, మహిళలు, పెద్ద సంఖ్యలో మధు గౌడ్‌కు మద్దతుగా నిలిచారు. పారదర్శక పాలన, గ్రామ అభివృద్ధి, తన ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లిన ఆయనకు ప్రజలు ఘన విజయాన్ని అందించారు.
ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లి గ్రామ ఉపసర్పంచిగా కందుకూరి నవీన్ ఎన్నికయ్యారు. నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌ల విజయంతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. యువ నాయకుడి విజయం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.


