సాక్షి, హైదరాబాద్: ఐడీపీఎల్ భూములపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు మంగళవారం ఆదేశించింది.
గత కొన్నిరోజులుగా కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత మధ్య ఈ భూములకు సంబంధించి పరస్పర ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మాధవరం, ఆయన తనయుడిపై కవిత ఆరోపణలు చేయగా.. కవిత భర్త అనిల్‌పై మాధవరం కబ్జా ఆరోపణలు చేశారు.
సుమారు 4 వేల కోట్ల రూపాయల విలువైన భూములపై ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో.. సర్వే నెంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ సమగ్ర విచారణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది.


