breaking news
IDPL lands
-
ఐడీపీఎల్ భూములపై విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఐడీపీఎల్ భూములపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు మంగళవారం ఆదేశించింది. గత కొన్నిరోజులుగా కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత మధ్య ఈ భూములకు సంబంధించి పరస్పర ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మాధవరం, ఆయన తనయుడిపై కవిత ఆరోపణలు చేయగా.. కవిత భర్త అనిల్‌పై మాధవరం కబ్జా ఆరోపణలు చేశారు. సుమారు 4 వేల కోట్ల రూపాయల విలువైన భూములపై ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో.. సర్వే నెంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ సమగ్ర విచారణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. -
అమ్మకానికి ఐడీపీఎల్ భూములు!
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్(ఐడీపీఎల్) వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఐడీపీఎల్‌తో పాటు ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలకు చెందిన నిరుపయోగ భూమిని విక్రయించాలనే యోచన ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్(బీసీపీఎల్), హిందూస్తాన్ యాంటిబయాటిక్స్(హెచ్ఏఎల్), హిందూస్తాన్ ఆర్గానిక్ కెమికల్స్(హెచ్ఓసీఎల్) తదితర కంపెనీలకు ముంబై, పుణే, తదితర ప్రధాన నగరాల్లో వేల కోట్ల విలువ చేసే భూములు నిరుపయోగంగా ఉన్నాయని వివరించారు. ఈ భూముల విక్రయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, విక్రయించాలనే అభిప్రాయం ప్రాథమికంగా వ్యక్తం అయిందని పేర్కొన్నారు. ఐడీపీఎల్‌కు హైదరాబాద్, గుర్గావ్, హరిద్వార్‌ల్లో, బీసీపీఎల్కు కోల్‌కతా, ముంబై, కాన్పూర్లలో హెచ్ఏఎల్కు పుణే లో, హెచ్ఓసీఎల్కు మహారాష్ట్ర, కేరళల్లో భూములున్నాయన్నారు. డిజిన్వెస్ట్మెంట్కు సమస్యల నేపథ్యంలో వాటా విక్రయం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరించాలని యోచిస్తోందని, దీంట్లో భాగంగానే ఈ భూ ముల విక్రయం తెరపైకి వచ్చిందని సమాచారం.


