తెలంగాణకు అలర్ట్‌.. 17 జిల్లాల్లో 13 నుంచి భారీ వానలు | IMD Says Heavy Rain Forecast To Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు అలర్ట్‌.. 17 జిల్లాల్లో 13 నుంచి భారీ వానలు

Aug 11 2025 7:41 AM | Updated on Aug 11 2025 9:11 AM

IMD Says Heavy Rain Forecast To Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, సోమవారం, మంగళవారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది.

heavy rainfall in hyderabad telangana photos3

అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు.. హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.

Hyderabad Rains : Heavy Rain Lashes Hyderabad4

నేడు, రేపు భారీ వర్షాలు.. 
సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడనున్నాయి.

ఇక, ఆదివారం నిర్మల్‌ జిల్లా అక్కాపూర్‌లో 11.05 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 8.93, ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో 7.28, వరంగల్‌ జిల్లా దుగ్గొండిలో 6.70 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌తో పాటు నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.

Hyderabad Rains : Heavy Rain Lashes Hyderabad8

మరోవైపు.. ఏపీలో రాబోయే రోజుల్లో వర్షాలు జోరందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

సోమ, మంగళవారాల్లో రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, వాయవ్య గాలుల ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement