సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్, లక్డీకపూల్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్, మోహిదీపట్నం, అత్తాపూర్, ఆరాంఘర్, కూకట్‌పల్లి, మూసాపేట్, బాలానగర్‌లో కుండపోతగా వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది.

పలు ప్రధాన రహదారులన్నీ జలమయమై.. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
#HYDTPinfo
🚧 Traffic Alert 🚗
Due to waterlogging and ongoing road work near Mehdi Function Hall, Ayodhya Junction, the movement of vehicles is slow in the area.
Commuters are advised to plan their travel accordingly and use alternate routes where possible.
Drive cautiously and… pic.twitter.com/kAByg5kMpK— Hyderabad Traffic Police (@HYDTP) October 25, 2025
కాగా, ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఐఎండీ.. అత్యంత అప్రమత్తత ప్రకటించింది. 27, 28 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 27న భారీ వర్షాలు పడే అవకాశముందని.. బాపట్ల, ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఈ నెల 28న కాకినాడ సమీపంలో మెంథా తీవ్ర తుఫాన్. తీరం దాటనుంది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

#HYDTPinfo
🌧️ Traffic Alert 🚗
Due to waterlogging on Panjagutta Flyover towards NFCL, vehicle movement is slow in the area.
Commuters are advised to plan their travel accordingly and drive with caution. 🚦#HyderabadTraffic #TrafficUpdate #RainAlert #DriveSafe pic.twitter.com/R7iceOFQbV— Hyderabad Traffic Police (@HYDTP) October 25, 2025


