తెలంగాణపై మోంథా.. స్కూల్స్‌ బంద్‌, రెడ్‌ అల్టర్‌ | Cyclone Montha Effects On Many Districts In Telangana, Holidays Declared For Schools And Red Alert Issued | Sakshi
Sakshi News home page

Cyclone Montha: తెలంగాణపై మోంథా ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో స్కూల్స్‌ బంద్‌, రెడ్‌ అల్టర్‌

Oct 29 2025 9:00 AM | Updated on Oct 29 2025 11:39 AM

Montha Cyclone Effect in Telangana And Many Districts

సాక్షి, హైదరాబాద్‌: మోంథా తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ పైనా కూడా తుపాను ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తుపాను ప్రభావం ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపై అధికంగా ఉంటుందని హెచ్చరించింది. మూడు జిల్లాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే,  ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్‌, నాగర్‌ కర్నూల్‌, వికారాబాద్‌,  జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాద్‌, మంచిర్యాల, సంగారెడ్డి, జనగాం​, జోగులాంబ గద్వాల్‌, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ విధించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, వర​ంగల్‌, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌లో కూడా వర్షం కురుస్తోంది.

మరోవైపు.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యాసంస్థలకు  నేడు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అలాగే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement