సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలో(ఫిల్మ్‌నగర్) అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపి హంగామా క్రియేట్ చేసింది. కాగా, సదరు యువతిని డాక్టర్‌గా పోలీసులు గుర్తించారు.
వివరాల ప్రకారం.. ఫిల్మ్‌నగర్‌కు చెందిన యువతి శుక్రవారం అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి కారు(TS09FT0207) నడిపింది. ఈ క్రమంలో హైస్పీడ్‌తో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది. దీంతో, కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం కారణంగా కారులోని డ్రైవర్ సీటులోనే ఆమె ఇరుక్కుపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు అద్దాలు పగులగొట్టి ఆమెను బయటకు తీశారు. అయితే, ప్రమాదం సమయంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది.
అయితే, కారు ప్రమాదంలో కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదం అనంతరం పోలీసులు ప్రమాదానికి గురైన కారును సీజ్ చేయకపోగా.. కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. కారు బీభత్సం అనంతరం విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ప్రమాదం జరిగిన తర్వాత రాత్రే కారును పోలీసులు వదిలేశారు. మద్యం మత్తులోనే ప్రమాదం అనంతరం కారు తీసుకొని ఆమె ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. దీంతో, ఫిల్మ్‌నగర్ పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


