హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈ మేరకు మంగళవారం(డిసెంబర్ 30వ తేదీ) ఐఏఎస్‌ల బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ కలెక్టరగా చంద్రశేఖర్, నిజామాబాద్ కలెక్టర్‌గా త్రిపాఠి, జీహెచ్‌ఎంసీ కమిషనర్లుగా శ్రీజన, వినయ్ కృష్ణారెడ్డిలను బదిలీ చేశారు. పీఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్‌గా శ్రుతి ఓజా, నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్‌లను బదిలీ చేశారు.


