బంగారం ధరలు ఉదయం గరిష్టంగా రూ. 770 తగ్గింది. అయితే సాయంత్రానికి మరో 810 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు (శుక్రవారం) గోల్డ్ రేటు 1580 రూపాయలు తగ్గిందన్నమాట. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 1,27,040 వద్దకు చేరింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.118400 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,16,450 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 1450 తగ్గిందన్న మాట. (ఉదయం 700 రూపాయలు మాత్రమే తగ్గింది, ఇప్పడు మరో 750 రూపాయలు తగ్గి.. మొత్తం రూ. 1450 తగ్గింది).
24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1580 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ. 127040 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 770 రూపాయలు తగ్గింది. సాయంత్రానికి మరో 810 రూపాయలు తగ్గడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1580 తగ్గింది).
ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి తగ్గింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1580 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ. 127190 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1450 తగ్గి.. 1,16,600 రూపాయల వద్దకు చేరింది.
ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1750 తగ్గడంతో రూ. 128070 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1600 తగ్గి.. 117400 రూపాయల వద్దకు చేరింది.
ఇదీ చదవండి: సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!: రాబర్ట్ కియోసాకి


