బ్యాంక్‌లకు ఆర్థిక శాఖ ఆదేశం | Finance Ministry Mandates Urgent Vigilance Reporting for Bank Directors | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌లకు ఆర్థిక శాఖ ఆదేశం

Dec 30 2025 6:17 PM | Updated on Dec 30 2025 7:10 PM

Finance Ministry Mandates Urgent Vigilance Reporting for Bank Directors

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు హోల్‌టైమ్‌ డైరెక్టర్లకు (డబ్ల్యూటీడీ) సంబంధించి విజిలెన్స్‌ వ్యవహరాలను వెంటనే నివేదించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. బోర్డు స్థాయిలో నియామకాలకు సంబంధించి ప్రతికూల సమాచారాన్ని సకాలంలో నివేదించని పలు సంఘటనల నేపథ్యంలో ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్‌ఎస్‌) ఈ ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వరంగ సంస్థల చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ల నుంచి విజిలెన్స్‌ క్లియరెన్స్‌ కోరినప్పుడే.. ప్రైవేటు ఫిర్యాదులు, కోర్టుల పరిశీలనలు, సీబీఐ లేదా ఇతర చట్టపరమైన దర్యాప్తు సంస్థల సూచనలు వెలుగు చూస్తున్నట్టు పేర్కొంది. ఇందులో హోల్‌టైమ్‌ డైరెక్టర్లకు సంబంధించి కీలక సమాచారాన్ని విజిలెన్స్‌ క్లియరెన్స్‌ ఫార్మాట్‌ల నుంచి తొలగించడాన్ని ప్రస్తావించింది. దీంతో బోర్డు స్థాయిలో అధికారులకు సంబంధించి ప్రతికూల సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలంటూ ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలను ఆర్థిక శాఖ ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement