HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌ అంటే..? ఎందువల్ల వస్తుందంటే.. | Health: HER2-positive breast cancer: What is it | Sakshi
Sakshi News home page

HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..

Nov 14 2025 2:27 PM | Updated on Nov 14 2025 3:00 PM

Health: HER2-positive breast cancer: What is it

సాధారణ రొమ్ము కేన్సర్‌ గురించి అందరికీ తెలిసింది. కానీ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌ గురించి చాలామంది మహిళలకి తెలియదు. ఇది సాధారణ రొమ్ము కేన్సర్‌ కంటే ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ఈ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌ చాలా దూకుడుగా ఉంటుంది, పైగా శరీరంలోని ఇతర భాగాలకు చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇటీవల కాలంలో ఈ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన తోపాటు ఎలాంటి చర్యలతో ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు వంటి వాటి గురించి హైదరాబాద్‌కి చెందిన ఒమేగా హాస్పిటల్స్‌ మెడికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ వింధ్య వాసిని మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.

1 ప్రశ్న: హైదరాబాద్‌లో HER2-పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయా? ఎందుకు?
డాక్టర్‌: దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు మనం HER2-పాజిటివ్ నిర్ధారణలను ఎక్కువగా ఉన్నాయనే చెప్పారు. బహుశా దీనిపై అవగాహన పెరగడం, ఎక్కువమంది మహిళలు ముదుగానే స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం  వంటివి అయ్యిండొచ్చని అన్నారు. అలాగే జీవనశైలి మార్పులు కూడా ఈ కేసులు అధికమవ్వడానికి కారణం కావొచ్చని ఆమె అన్నారు. 

2  ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ ఇతర వాటికంటే ఎలా భిన్నంగా ఉంటుంది?
డాక్టర్‌: HER2-పాజిటివ్ రొమ్ము కేన్స ర్‌అనేది కణాల ఉపరితలంపై కణ పెరుగుదల, విభజనను ప్రోత్సహించే గ్రాహకమైన HER2 (హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 కి సంక్షిప్తంగా) ప్రోటీన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుందని అన్నారు. అందువల్ల  ఈ కేన్సర్‌ ఇతర రకాల కేన్సర్‌ల కంటే మరింత దూకుడు స్వభావం కలది. అయితే దీన్ని HER2ను లక్ష్యంగా చేసుకుని మందులతో రోగులకు చికిత్స అందించవచ్చు. 

గత రెండు దశాబ్దాలుగా ఈ చికిత్సలు  HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌ దృక్పథాన్నే మార్చేశాయి. ఒకప్పడు ఈ కేన్సర్‌ అధిక ప్రమాదకరమైనదిగా పరిగణించేవారని, ఇప్పుడూ మందులతో నిర్వహించేలా చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

3 ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌పై హైదరాబాద్‌లో ఏవైనా శాస్త్రీయ ఆవిష్కరణలు జరుగుతున్నాయా?
డాక్టర్‌: అవును. హైదరాబాద్‌లోని అనేక ఆసుపత్రులు ఇప్పుడు కొత్త చికిత్సా పద్ధతులను అందిస్తున్నాయి.ఉదాహరణకు సబ్కటానియస్ ఫార్ములేషన్స్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీలు. ఇవి మందులతో వేగవంతంగా తగ్గించడమే కాకుండా రోగికి సౌకర్యవంతంగా కూడా ఉంటున్నాయి.

4 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌కు ఏయే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?
డాక్టర్‌: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌కు అనేక చికిత్సా ఎంపికలు ఉన్నాయి - కేన్సర్‌ర్ ఎంత అభివృద్ధి చెందింది, అది వ్యాపించిందా, ఎంత వేగంగా పెరుగుతోంది వంటి వాటికి సంబంధించిన మొత్తం రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అదృష్టం ఏంటంటే..HER2 ప్రమేయం ఉందని మనకు తెలుసు కాబట్టి, సాధారణమైన వాటికి అదనంగా ప్రభావవంతమైన "టార్గెటెడ్" చికిత్సలు ఉన్నాయి. అవేంటంటే..

a. టార్గెటెడ్ థెరపీలు: ఈ మందులు ప్రత్యేకంగా కేన్సర్ కణాల పెరుగుదలను ఆపడానికి HER2 ప్రోటీన్‌ను నిరోధిస్తాయి.
b. కీమోథెరపీ: ప్రభావాన్ని పెంచడానికి తరచుగా టార్గెటెడ్ థెరపీలతో కలిపి ఉపయోగిస్తారు.
c. శస్త్రచికిత్స: కేసును బట్టి కణితి లేదా రొమ్ము కణజాలాన్ని తొలగించడం.
d. రేడియేషన్ థెరపీ: పునరావృత ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక సందర్భాల్లో శస్త్రచికిత్స తర్వాత ఉపయోగిస్తారు.
e. హార్మోన్ల చికిత్స: కణితి కూడా హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్ అయితే సిఫార్సు చేయవచ్చు.

ఇప్పుడు లక్ష్యంగా చేసుకున్న చికిత్సలు చర్మం కింద ఇంజెక్ట్ చేసేలా సబ్కటానియస్ ఫార్ములేషన్‌లుగా అందుబాటులో ఉన్నాయి. అలాగే దీర్ఘ IV ఇన్ఫ్యూషన్‌లతో (సుమారు 4-6 గంటలు) పోలిస్తే వేగంగా  (సుమారు 8 నిమిషాలు) చికిత్సను పూర్తి చేయొచ్చు. రోగి సౌకర్యంగా ఉండేలా చికిత్సా కేంద్రాల్లో గడిపే సమయం కూడా తగ్గేలా పలు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

5 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌ జర్నీలో రోగులు, సంరక్షకులు తప్పక తెలుసుకోవాల్సినవి ఏవి?

డాక్టర్‌: a. HER2 స్థితిని నిర్ణయించడానికి  తగిన చికిత్సను ప్లాన్ చేయడానికి ముందుగా సరైన సమయంలో రోగ నిర్ధారణ చేయడం అనేది ముఖ్యం

b. చికిత్సకు కట్టుబడి ఉండటం కీలకం. మోతాదులను కోల్పోవడం లేదా చికిత్సను మధ్యలో ఆపడం వల్ల ప్రభావం తగ్గుతుంది.

c. రోగులు,వారి సంరక్షకులకు భావోద్వేగ మద్దతు చాలా ముఖ్యమైనది. ఇది ఒకరకంగా మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడం, స్థితిస్థాపకతను పెంపొందించడంలో సహాయపడుతుంది.

d. సంరక్షణ బృందంతో సకాలంలో కమ్యూనికేషన్ ద్వారా దుష్ప్రభావాలను నిర్వహించడం జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది.

e. భారతదేశంలో ప్రస్తుతం రోగి సౌకర్యార్థం మెరుగైనా సబ్కటానియస్ థెరపీలు అనే కొత్త చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఇవి రోగి చికిత్సా సమయాన్ని తగ్గించడమే కాకుండా ఆస్పత్రి సందర్శన కూడా తగ్గుతుంది. 

చివరగా రోగి సంరక్షకులు ఇలాంటి చికిత్సా విధానాలు, మంచి ప్రత్యామ్నాయాల గురించి వైద్యులతో సంభాషించి, సవివరంగా తెలుసుకోవాలి, సత్వరమే కోలుకునే చికిత్సా విధానాల గురించి క్షణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారామె.
ఒమేగా హాస్పిటల్స్‌ మెడికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ వింధ్య వాసిని 
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement