→ డయానా పుండోల్
32 ఏళ్ల ఈ ఇద్దరు పిల్లల తల్లి మోటార్ రేసింగ్‌లో మొదటి మహిళా జాతీయ ఛాంపియన్. ఆమె 2024లో ఎంఆర్‌ఎఫ్ ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకున్నారు. పురుషులు–ఆధిపత్యం వహించే ఈ క్రీడలో స్త్రీల నుంచి ఇదో పెద్ద ముందడుగు. ఇప్పుడు 2025–2026 ఫెరారీ క్లబ్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్ సిరీస్‌లో ΄ోటీ పడుతున్న మొదటి భారతీయ మహిళగా నిలిచారు, ఫెరారీ 296 ఛాలెంజ్ కారును నడుపుతున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయురాలిగా పనిచేసి, ఇప్పుడు రేసింగ్‌లో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
→ అంజ్లీ అగర్వాల్
డాక్టర్ అంజ్లీ అగర్వాల్‌కు జీవితంలో ఎదురైన లోతైన బాధలెన్నో తెలుసు. కండరాల బలహీనతతో చక్రాల కుర్చీలో జీవిస్తున్నారామె. బహిరంగ స్థలాల్లో ర్యాంప్ లేక΄ోవడం వల్ల అవస్థ పడుతున్న తనలాంటి వేలమంది దివ్యాంగుల కోసం ఆమె ΄ోరాటం సాగిస్తున్నారు. ఆమె, ఆమె బృందం కలిసి వందలాది ప్రజా స్థలాలకు పునః రూపకల్పన చేశారు. ర్యాంప్ ఉండటం వల్ల దివ్యాంగులు సౌకర్యవంతంగా ప్రయాణించగలరని అధికారులకు అవగాహన కల్పించారు.
→ బీబీ జాన్
కర్నాటకకు చెందిన బీబీ జాన్ చిన్నపాటి లోన్ కోసం బ్యాంక్ వెళితే తనలాంటి వాళ్లకు లోన్ రావడం ఎంత కష్టమో తెలియడమే కాకుండా తనలాంటి వాళ్లు చాలామంది లోన్ల కోసం బాధలు పడుతున్నారని అర్థమైంది. దాంతో ఆమె స్థానిక స్వయం సహాయక సంఘానికి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చి 14 మంది సభ్యుల బృందంతో మొదలుపెట్టి నేడు 1,000 మందికి పైగా మహిళల సమష్టి ఎదుగుదలకు కారణమయ్యారు. వారంతా స్వంత మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నడుపుతూ
సేంద్రీయ, వాతావరణ–స్థిరమైన పద్ధతులను ఉపయోగించి 30 గ్రామాలలో వ్యవసాయం చేస్తున్నారు.


