సాక్షి హైదరాబాద్: ఇటీవల భరత్‌నగర్ ప్రాంతంలో మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా III స్పెషల్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడు కరణ్ సింగ్‌ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దానితో పాటు రూ. పదివేలు జరిమానా చెల్లించాలని తెలిపారు.
ఈ నెల 18 వతేదీ భరత్‌గర్‌లోని ఫ్లై ఓవర్ సమీపంలోని ఏసీసీ గోదాం పక్కన ఉన్న పొదల్లో ఒక మహిళ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు వివరాలు అందించగా వారు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కర్ణాటక బీదర్‌కు చెందిన కరణ్ సింగ్‌ను నిందితునిగా అనుమానిస్తూ అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు కరణ్ సింగ్‌ను దోషిగా తేలుస్తూ మరణశిక్ష విధించింది.


