మున్సిపల్‌ ముచ్చట్లు | Municipal elections Results 2026 in Telangana | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ముచ్చట్లు

Feb 14 2026 5:25 AM | Updated on Feb 14 2026 5:33 AM

Municipal elections Results 2026 in Telangana

తల్లీకొడుకు విజయం 
తిరుమలగిరి (తుంగతుర్తి) : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సి పాలిటీలో తల్లీకొడుకు విజయం సాధించారు. 4వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన బత్తుల శకుంతల,ఆమె కుమారుడు బత్తుల శ్రీనివాస్‌ 7వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

మెదక్‌కలెక్టరేట్‌: మెదక్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో తల్లీకొడుకు గెలిచారు. 14వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యరి్థగా దొంతి లక్షి్మ, 15వ వార్డు నుంచి దొంతి నరేశ్‌ గౌడ్‌ ఘన విజయం సాధించారు.  

ఖమ్మంరూరల్‌: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో. 15వ డివిజన్‌ నుంచి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఆమె కుమారుడు  నవీన్‌ 14వ డివిజన్‌ నుంచి గెలుపొందారు. 

అన్నపై తమ్ముడి గెలుపు 
నర్సంపేట: వరంగల్‌ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డునుంచి అన్నా తమ్ము డు పోటీ చేయగా, అన్నపై తమ్ముడు గెలిచాడు. బీఆర్‌ఎస్‌ నుంచి బీరం నాగిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి బీరం భరత్‌రెడ్డి బరిలో ఉండగా, భరత్‌రెడ్డి తన అన్న నాగిరెడ్డిపై 172ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
కల్వకుర్తిలోని ఏడో వార్డులో భార్య రత్నమాల కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించగా.. 13వ వార్డులో భర్త ఆనంద్‌కుమార్‌ ఓడిపోయారు.  
⇒  గద్వాల మున్సిపాలిటీలో బీజేపీ నుంచి పోటీ చేసిన దంపతులు గెలుపొందారు. 19వ వార్డు నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, 26వ వార్డు నుంచి ఆయన భార్య కృష్ణవేణి గెలుపొందారు.  

⇒  వనపర్తి మున్సిపాలిటీలో కూతురు   సౌమ్య (కాంగ్రెస్‌)  ఆమె తల్లి అరుణ (బీఆర్‌ఎస్‌)  విజయం సాధించారు. 
⇒  జహీరాబాద్‌ మున్సిపాలిటీలోని 33వ వార్డు నుంచి తాహెరాబేగం(కాంగ్రెస్‌) 34వ వార్డు నుంచి ఆమె కోడలు నయ్యర్‌ బేగం స్వతంత్ర అభ్యరి్థగా  విజయం సాధించింది.   
⇒  మంచిర్యాల కార్పొరేషన్‌లో  తోటికోడళ్లు కాంగ్రెస్‌ కార్పొరేటర్లుగా గెలిచారు. 38వ డివిజన్‌ నుంచి పూదరి విజయరాణి, 39 డివిజన్‌ నుంచి పూదరి సునీత గెలుపొందారు.  

కల్నల్‌ తల్లి ఓటమి 
సూర్యాపేట: భారత్‌–చైనా సరిహద్దులో గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్‌ సంతోశ్‌బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయారు.  

మూడే ఓట్లు.. అయినా తగ్గేదేలె.. 
జనగామ: జనగామ మున్సిపాలిటీలోని 27వ వార్డు నుంచి 
స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఆంజనేయులుకు 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా మూడు వేళ్లతో చూపిస్తూ చిరునవ్వు చిందించారు.
కన్నీళ్లు పెట్టుకున్నా... 

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 9వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేసిన బొమ్మగాని రాజమణి ఓటమి పాలయ్యారు. ప్రచారంలో భాగంగా దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కన్నీళ్లు పెడుతూ యువతను ఓటు వేయాలని వేడుకుంది.  అయితే ఆమెకు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి.  

కానిస్టేబుల్‌ భార్య ఘన విజయం 
చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాలలో బీఆర్‌ఎస్‌ తరఫున 2వవార్డు అభ్యరి్థగా కమలాపురం గీతాంజలి బరిలో నిలిచారు. ఆమె భర్త రమేశ్‌ కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త రమేశ్‌ ప్రచారంలో పాల్గొన్నారని వచ్చిన ఆరోపణల మేరకు ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అయితే.. గీతాంజలి కాంగ్రెస్‌ అభ్యర్థి తేజపై 223 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ట్రాన్స్‌జెండర్‌ విజయం 
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని 1వ వార్డు  నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్‌ నాగిళ్ల సుధాకర్‌(కావేరి) తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో పోటీచేసిన సీపీఎం అభ్యర్థి జిట్ట నగే‹Ùపై 102 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. ఈ వార్డులో 1008 ఓట్లు పోల్‌ కాగా, సుధాకర్‌(కావేరి)కు 429 ఓట్లు, నగేశ్‌కు 327 ఓట్లు వచ్చాయి.  

కాలేజీ టు కౌన్సిలర్‌ 
కోదాడ: ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్‌టైమ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ జిల్లేపల్లి నాగేశ్వరరావు కోదాడ మున్సిపాలిటీలోని 20వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కాలిదాసు వెంకటరత్నంపై 203 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 
⇒  హైదరాబాద్‌లో లా ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న షేక్‌ నెహనాజ్‌ కోదాడలోని 26 వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా చివరి నిమిషంలో టికెట్‌ దక్కించుకొని విజయం సాధించారు. 

ఆయనకొచ్చిన ఓట్లు 0 
రామాయంపేట: రామాయంపేట మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగిన భూమ మల్లేశం తన ఓటు కూడా తాను వేసుకోలేకపోయాడు. ఆయన కుటుంబసభ్యులు కూడా మల్లేశంకు ఓటు వేయలేదు. దీంతో ఆయనకు సున్నా ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. 

బీజేపీ నుంచి గెలిచిన ముస్లిం మహిళ 
భువనగిరిటౌన్‌: భువనగిరి మున్సిపాలిటీలోని 5వ వార్డు బీజేపీ అభ్యరి్థగా పోటీచేసిన ముస్లిం మహిళ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ నాయకుడు తుమ్మల నగేశ్‌.. యాస్మిన్‌ను మతాంతర వివాహం చేసుకున్నాడు. 5వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో తన భార్య యాస్మిన్‌ను బీజేపీ తరఫున బరిలో నిలిపాడు.  

ఒక్క ఓటుతో.... 
పరకాల: పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి బొచ్చు సుభద్ర ఒక్క ఓటుతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యరి్థశనిగరపు రజనికి 368 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి బొచ్చు సుభద్రకు 366 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల మెజారిటీతో గెలుపు ఖాయమని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంతోషపడగా..పోస్టల్‌ బ్యాలెట్‌ మూడు ఓట్లు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి సుభద్రకే పడ్డాయి. దీంతో సుభద్ర ఓట్లు 369కి చేరాయి.  

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి కొడకంటి హరిత, బీఆర్‌ఎస్‌ నుంచి న్యాయవాది జీవన్‌రావు పోటీ చేశారు. హరితకు 366 ఓట్లు రాగా, జీవన్‌రావుకు 365 ఓట్లు వచ్చాయి.
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మున్సిపాలిటీలోని 2వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి జయలక్ష్మి ఒక్క ఓటుతో విజయం సాధించారు. జయలక్షి్మకి 355 ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మకు 354 ఓట్లు వచ్చాయి.  

కల్వకుర్తిలోని పదో వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎజాస్‌కు 259 ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాహిర్‌ అలీకి 258 ఓట్లు వచ్చాయి. 
గద్వాల మున్సిపాలిటీలోని 8వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి ఒక్క ఓటుతో విజయం సాధించారు. మొదట కౌంటింగ్‌ చేయగా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జయమ్మకు రెండు ఓట్ల మెజారిటీ వచ్చింది. మూడుసార్లు రీకౌంటింగ్‌ చేసి.. చివరికి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచినట్టు ఆర్‌ఓ ప్రకటించారు.

‘డ్రా’లో వరించిన విజయం 
నర్సాపూర్‌ /దుబ్బాకటౌన్‌/తూప్రాన్‌: ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో అధికారులు డ్రా తీసి విజేతను ప్రకటించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యరి్థగా పంబల్ల లలిత, కాంగ్రెస్‌ నుంచి వంకమల్ల జ్యోతి పోటీ పడ్డారు. ఇద్దరికీ సమానంగా 253 ఓట్లు వచ్చాయి.దీంతో అధికారులు డ్రా తీయగా.. పంబల్ల లలితకు విజయం వరించింది. లలిత 15వ వార్డు నుంచి రెండోసారి విజయం సాధించారు.  

 దుబ్బాక మున్సిపాలిటీలోని 3వ వార్డుకు చెందిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంకనాల ఎల్లవ్వ, బీజేపీ అభ్యర్థి సత్తు శ్రీలతకు సమానంగా 266 ఓట్లువచ్చా యి. అధికారులు టాస్‌ వేయగా బీఆర్‌ఎస్‌ అభ్యరి్థని గెలుపు వరించింది. 
 మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపాలిటీ 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గజ్జెల కృష్ణకు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సత్యలింగంకు 330 సమాన ఓట్లు వచ్చాయి. టాస్‌ వేయగా, సత్యలింగంకు అదృష్టం వరించింది. 

హస్తం గూటికి బీఎస్పీ అభ్యర్థి 
మెదక్‌జోన్‌: మెదక్‌లోని 17వ వార్డులో బీఎస్పీ తరఫున పోటీ చేసిన బుజరంపేట అరుణ గెలిచారు. అయితే కాంగ్రెస్‌ నేతలు ఆమెతో సంప్రదింపులు జరిపి తమ క్యాంపునకు తరలించారు. దీంతో కాంగ్రెస్‌ బలం15కు చేరింది. ఇక మిగిలిన ఇద్దరు బీజేపీ అభ్యర్థుల మద్దతు కోసం ఇరుపార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.  

నాటి సఫాయి.. నేడు కౌన్సిలర్‌ 
నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీ ఏర్పాటు కాకముందు 2018 వరకు గ్రామ çపంచాయతీలో సఫాయి కార్మికురాలిగా పనిచేసిన ఇంజమూరి వెంకటమ్మ ఇప్పుడు మున్సిపాలిటీలోని 10వవార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌నుంచి పోటీ చేసిన వెంకటమ్మ.. కాంగ్రెస్‌ అభ్యర్థి మచ్చ రాణిపై 10 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు.  

బీఆర్‌ఎస్‌ జంటపై.. కాంగ్రెస్‌ జంట  
నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలి టీలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన దంపతులు.. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన దంపతులపై విజయం సాధించారు. 4వార్డులో కొణతం మంజుల.. తన ప్రత్యర్థి నాగండ్ల ఇందువదనపై 72 ఓట్లతో, 15వ వార్డులో కొణతం చిన వెంకట్‌రెడ్డి.. తన ప్రత్యర్థి నాగండ్ల శ్రీధర్‌పై 203 ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్‌ తరఫున కొణతం మంజుల, చిన వెంకట్‌రెడ్డి పోటీ చేయగా.. బీఆర్‌ఎస్‌ నుంచి నాగండ్ల ఇందు వదన, శ్రీధర్‌ పోటీ చేసి ఓటమిపాలయ్యారు.  

కపుల్‌ ధమాకా రామాయంపేట
(మెదక్‌): రెండు వార్డుల్లో దంపతులు గెలుపొందారు. రామాయంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా,  లావణ్యతో ఒకటో వార్డు నుంచి, నాగరాజు 7 వార్డు నుంచి గెలిచారు. లావణ్యను చైర్‌పర్సన్‌ చేస్తామని ఇటీవల కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. 

ఓ జంటలో భార్య.. ఇంకో జంటలో భర్త ఓటమి 
సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీలోని 14వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యరి్థగా కూసంపూడి మహేశ్‌ గెలుపొందగా.. ఆయన భార్య మాధురి 3వ వార్డు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 22వ వార్డు కాంగ్రెస్‌ అభ్యరి్థగా ఎండీ.రెహనాబేగం గెలిచినా, ఆమె భర్త 20వ వార్డు అభ్యర్థి ఎం.డీ. కమాల్‌పాషా ఓడిపోయారు.  

జంటగా కౌన్సిల్‌లోకి... 
అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా జూపల్లి రమే‹Ùబాబు, ఆయన సతీమణి శశికళ విజయం సాధించారు. కాంగ్రెస్‌ తరఫున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ముందే ప్రకటించిన శశికళ 6వ వార్డు నుంచి ఆమె భర్త రమేశ్‌బాబు 13వ వార్డు నుంచి గెలుపొందారు.  

భర్త ఓటమి.. భార్య గెలుపు 
ఇదే కార్పొషన్‌ పరిధిలో దంపతుల్లో భార్య గెలుపొందగా.. భర్త ఓటమి చవిచూశాడు. 34వ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అగల్‌డ్యూటీ రాజు, 36వ డివిజన్‌ నుంచి అగల్‌డ్యూటీ రాణి పోటీచేశారు. వీరిలో అగల్‌డ్యూటీ రాణి గెలుపొందింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement