సాక్షి, ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని నౌగం పోలీసు స్టేషన్ వద్ద జరిగిన పేలుడు ఘటనపై ఎలాంటి ఊహాగానాలు వద్దు అంటూ డీజీపీ నలిన్ ప్రభాత్ చెప్పుకొచ్చారు. ఈ ఘటన దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాద ఘటనలో తొమ్మిది మంది చనిపోయినట్టు ధృవీకరించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
జమ్ముకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నౌగాం పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో పేలుడు పదార్థాలు ఉంచాం. ప్రొసీజర్ ప్రకారం ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించాం. గత రెండు రోజుల నుంచి ప్రొసీజర్ కొనసాగుతోంది. శాంపిల్ ప్రాసెసింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహించారు. పేలుడు పదార్థాలకు సున్నితమైన గుణం ఉంది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు రాత్రి 11:20 గంటలకు ప్రమాదం జరిగింది.
దీనిపై ఎలాంటి ఊహాగానాలు వద్దు.
ఇదొక దురదృష్టకర ఘటన. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. ముగ్గురు ఎఫ్ఎస్ఎల్ నిపుణులు మృతిచెందారు. 27 మంది పోలీసులు గాయపడ్డారు. పేలుడు కారణంగా పోలీసు స్టేషన్ చుట్టుపక్కల ఇల్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.
DGP J&K addresses the media at PCR Kashmir with recent events.@JmuKmrPolice pic.twitter.com/zFmCA0uJ9k
— newspointJ&K (@NewspointjK) November 15, 2025


