కట్టల కొద్దీ నగదు... సూట్‌కేస్‌ నిండా నగలు | ED raids ten locations connected to mobster Indrajeet Yadav of Haryana | Sakshi
Sakshi News home page

కట్టల కొద్దీ నగదు... సూట్‌కేస్‌ నిండా నగలు

Jan 1 2026 4:59 AM | Updated on Jan 1 2026 5:35 AM

ED raids ten locations connected to mobster Indrajeet Yadav of Haryana

ఢిల్లీలో ఓ ఇంటి నుంచి స్వాదీనం చేసుకున్న ఈడీ 

మనీలాండరింగ్‌ కేసులో ఇంద్రజిత్‌ యాదవ్‌పై 14 ఎఫ్‌ఐఆర్‌లు

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో దేశరాజధానిలోని ఒక ఇంట్లో జరిగిన సోదాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రూ.5.12 కోట్ల నగదు, రూ.8.80 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్‌ కేసులో ఇంద్రజిత్‌ యాదవ్, అతని సహచరులపై హరియాణా, ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు 14 ఎ‹ఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసులో 26, 27 తేదీల్లో ఢిల్లీ, గురుగ్రామ్, రోహతక్‌లోని 10 ప్రదేశాల్లో ఈడీ మొదటి దశ సోదాలు నిర్వహించింది. 

ఈ కేసు దర్యాప్తులో భాగంగా దక్షిణ ఢిల్లీలోని సర్వప్రియ విహార్‌లోని నివాస ప్రాంగణంలో ఈడీ బుధవారం దాడులు చేసింది. ఇప్పటివరకు రూ.5.12 కోట్ల నగదు, రూ.8.80 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలతో కూడిన సూట్‌కే‹స్, బ్యాంకు చెక్‌ పుస్తకాలు ఉన్న బ్యాగ్, రూ.35 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాదీనం చేసుకున్నది. 

వివిధ కేసుల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న యాదవ్‌ పరారీలో ఉన్నాడని, యూఏఈ నుంచి పని చేస్తున్నాడని ఈడీ తెలిపింది. ప్రైవేట్‌ ఫైనాన్సర్ల నుంచి పెద్ద మొత్తాలను అప్పుగా తీసుకున్న అపోలో గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్, ఝజ్జర్‌ కంపెనీలు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులను జారీ చేశాయని, ఈ వందల కోట్ల రూపాయల ఆర్థిక వివాదాలను పరిష్కరించడానికి మధ్యవర్తిగా యాదవ్‌ వ్యవహరించాడని ఈడీ తెలిపింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement