సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులు ఎంతో సేవాభావంతో పని చేస్తున్నారని.. ప్రాణాలకు తెగించి శాంతిభద్రతలను రక్షిస్తున్నారని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. 2025 ఏడాదికిగానూ పోలీసుల పనితీరుపై నివేదికను మంగళవారం వార్షిక పాత్రికేయ సమావేశంలో ఆయన వివరించారు.
ఈ ఏడాది రాష్ట్రంలో శాంతి భధ్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. తెలంగాణ పోలీసులు ఎంతో సేవాభావంతో పని చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి శాంతి భద్రతలను రక్షిస్తున్నారు. 2025లో తెలంగాణలో 782 హత్యలు జరిగాయి. క్రైమ్ రేట్ 2.33 శాతం తగ్గింది. ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వర్షాలు.. వరదల సమయంలో సహాయక బృందాలతో సమన్వయంగా పోలీసులు పని చేశారు.

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జాతీయ, అంతర్జాతీయ సభలను అడ్డంకులు లేకుండా జరుపుకున్నాం. ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ పర్యటన కూడా విజయవంతమైంది. తెలంగాణ స్టేట్ టాప్ పోలీసింగ్‌గా ఉంది. తెలంగాణ టూరిస్ట్ పోలీస్ పెట్టాం. అందులో 80 మంది సిబ్బంది ఉన్నారు. ఫీడ్ బ్యాక్ కోసం ప్రతీ పీఎస్‌లో క్యూఆర్ కోడ్ పెట్టాం’’ అని వివరించారాయన.
ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు ఐబొమ్మ రవి కేసుపైనా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదు. ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో మాకు తెలుసు’’ అని అన్నారాయన.
క్రైమ్ ట్రెండ్.. గత 5 సంవత్సరాల (జనవరి నుండి నవంబర్ వరకు) నేరాల తులనాత్మక నివేదిక👇


