breaking news
Naugam Sector
-
పేలుడు ఘటనపై ఊహాగానాలు వద్దు: జమ్ము కశ్మీర్ డీజీపీ
సాక్షి, ఢిల్లీ: జమ్ము కశ్మీర్లోని నౌగం పోలీసు స్టేషన్ వద్ద జరిగిన పేలుడు ఘటనపై ఎలాంటి ఊహాగానాలు వద్దు అంటూ డీజీపీ నలిన్ ప్రభాత్ చెప్పుకొచ్చారు. ఈ ఘటన దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాద ఘటనలో తొమ్మిది మంది చనిపోయినట్టు ధృవీకరించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.జమ్ముకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నౌగాం పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో పేలుడు పదార్థాలు ఉంచాం. ప్రొసీజర్ ప్రకారం ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించాం. గత రెండు రోజుల నుంచి ప్రొసీజర్ కొనసాగుతోంది. శాంపిల్ ప్రాసెసింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహించారు. పేలుడు పదార్థాలకు సున్నితమైన గుణం ఉంది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు రాత్రి 11:20 గంటలకు ప్రమాదం జరిగింది. దీనిపై ఎలాంటి ఊహాగానాలు వద్దు. ఇదొక దురదృష్టకర ఘటన. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. ముగ్గురు ఎఫ్ఎస్ఎల్ నిపుణులు మృతిచెందారు. 27 మంది పోలీసులు గాయపడ్డారు. పేలుడు కారణంగా పోలీసు స్టేషన్ చుట్టుపక్కల ఇల్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు. DGP J&K addresses the media at PCR Kashmir with recent events.@JmuKmrPolice pic.twitter.com/zFmCA0uJ9k— newspointJ&K (@NewspointjK) November 15, 2025 -
కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాక్
శ్రీనగర్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి దుందుడుకు చర్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం మోర్టార్లు విసురుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ము కశ్మీర్లోని నౌగాం సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోర్టార్లు విసురుతూ, ఇతర ఆయుధాలతో కాల్పులకు దిగిన పాక్ సైనికులకు ధీటుగా బదులిచ్చామని భారత ఆర్మీ స్పష్టం చేసింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది. కాగా పాక్ ఒక్క మంగళవారం నాడే రెండుసార్లు కాల్పులు విరమణ ఒప్పందాన్ని కాలరాసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. (పీవోకే ప్రజలు భారత్లో కలవాలనుకుంటారు) సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు.. -
ఆ గ్రెనేడ్లపై పాక్ గుర్తులు
శ్రీనగర్: కశ్మీర్లోని నౌగామ్ సెక్టార్లో గురువారం నలుగురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లపై పాకిస్తాన్కు సంబంధించిన గుర్తులున్నాయని ఆర్మీ తెలిపింది. ఈ గ్రెనేడ్లపై ఉన్న పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు.. ఉగ్రవాదానికి పాక్ సహకరిస్తోందనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు శనివారం పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మందులు, ఆహారపదార్థాలపై కూడా పాక్ గుర్తులు ఉన్నాయని ఆయన తెలిపారు. గురువారం పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వ్యాలీలోకి ప్రవేశించేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే.


