ఆ గ్రెనేడ్లపై పాక్ గుర్తులు | Pakistani markings on grenades seized from terrorists in Naugam | Sakshi
Sakshi News home page

ఆ గ్రెనేడ్లపై పాక్ గుర్తులు

Oct 9 2016 1:36 AM | Updated on Mar 23 2019 8:00 PM

ఆ గ్రెనేడ్లపై పాక్ గుర్తులు - Sakshi

ఆ గ్రెనేడ్లపై పాక్ గుర్తులు

కశ్మీర్‌లోని నౌగామ్ సెక్టార్‌లో గురువారం నలుగురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లపై పాకిస్తాన్‌కు సంబంధించిన గుర్తులున్నాయని ఆర్మీ తెలిపింది.

శ్రీనగర్: కశ్మీర్‌లోని నౌగామ్ సెక్టార్‌లో గురువారం నలుగురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లపై పాకిస్తాన్‌కు సంబంధించిన గుర్తులున్నాయని ఆర్మీ తెలిపింది. ఈ గ్రెనేడ్లపై ఉన్న పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు.. ఉగ్రవాదానికి పాక్ సహకరిస్తోందనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు శనివారం పేర్కొన్నారు.

ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మందులు, ఆహారపదార్థాలపై కూడా పాక్ గుర్తులు ఉన్నాయని ఆయన తెలిపారు. గురువారం పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వ్యాలీలోకి ప్రవేశించేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement