వరుస దెబ్బలతో అట్టుడుకుతున్న మావోయిస్టు పార్టీకి ఏవోబీలో మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 22మంది నక్సల్స్ లొంగిపోయారు. ఒడిశా మల్కాన్ గిరి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట ఈ లొంగుబాటు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మావోయిస్టుల వద్ద ఉన్న 14 ల్యాండ్‌మైన్‌లను పోలీసులకు అప్పగించారు. వీరందరిపై రూ.2.18కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
మార్చి 2026 నాటికి దేశంలో నక్సలైట్లను లేకుండా చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాయుధబలగాలు ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో నక్సల్స్‌పై విరుచుకపడుతున్నాయి. దీంతో పెద్దఎత్తున మావోయుస్టులు ఎన్‌కౌంటర్‌లలో మరణిస్తున్నారు. అంతే స్థాయిలో పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు.ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ భవితత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి.


