హైదరాబాద్‌లో భారీ వర్షం | Sudden Heavy Rainfall Hits Hyderabad, Thunderstorms And Lightning Across Key Areas | Sakshi
Sakshi News home page

Hyderabad Rains News: హైదరాబాద్‌లో భారీ వర్షం

Sep 22 2025 4:29 PM | Updated on Sep 22 2025 6:24 PM

Heavy Rain In Hyderabad Sept 22nd

హైదరాబాద్‌:  నగరాన్ని వరుణుడు వీడటం లేదు. రోజూ ఏదొక సమయంలో వర్షం నగరాన్ని పలకరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లో వర్షం కుమ్మేసింది.. సోమవారం(సెప్టెంబర్‌ 22వ తేదీ) సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి భారీ వర్షంగా మారిపోయింది. 

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఎస్‌ఆర్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఫిల్మ్‌నగర్‌, సనత్‌నగర్‌ తదితర  ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది . నగరంలొని పలు చోల్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రధానంగా సోమాజిగూడ నుంచి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్‌ స్థంభించిపోయింది. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  లక్డీకాపూల్‌,  నాంపల్లి, అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 

నిమిషనిమిషానికి వర్ష తీవ్రత పెరుగుతోంది. నగరంలోని పలుచోట్ల కుండపోత వర్షం పడింది. మరో రెండు గంటల పాటు భారీగా వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక  చర్యల్లో నిమగ్నమైంది.  డీఆర్‌ఎఫ్‌, హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయక చర్యలు  చేపట్టారు. ఆఫీస్‌ లాగౌట్‌ కావడంతో ఎవరూ బయటకు రావొద్దని అధికారులు అదేశించారు. హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. 

 

 

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement