సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ ఎగ్జామ్స్‌లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి కాపీ కొట్టే ప్రయత్నంలోనే అనూహ్యంగా ఆ ఇద్దరూ దొరికిపోయారని పోలీసులు వెల్లడించారు.
గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు జరిగాయి. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఇద్దరు అభ్యర్థులు అనిల్ కుమార్, సతీష్ పట్టుబడ్డారు. వర్సిటీ రిజిస్ట్రార్ దివేశ్ నిగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం.
అయితే.. డిసెంబర్ 21వ తేదీన నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు ఏఐతో పరీక్ష కాపీ కొట్టబోయారు. ముందుగా.. షర్ట్ బటన్లకు అమర్చిన మైక్రో స్కానర్లతో పేపర్ స్కాన్ చేశారు. తరచూ బాత్‌రూమ్‌కు వెళ్లి ఏఐ సాయంతో సమాధానాలు సేకరించారు. చెవిలో ఉన్న బ్లూటూత్ పరికరాల ద్వారా సమాధానాలు వింటూ ఎగ్జామ్ రాశారు. ఈ క్రమంలో..
బ్లూటూ్ నుంచి వచ్చిన ‘బీప్’ శబ్దంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో.. నిందితుల మొబైల్ ఫోన్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, మైక్రో ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.


