దోమలు చంపుతున్నాయ్‌! | hyderabad mosquito menace rajamouli son karthikeya satirical video | Sakshi
Sakshi News home page

దోమలు చంపుతున్నాయ్‌!

Feb 8 2026 7:25 AM | Updated on Feb 8 2026 8:33 AM

hyderabad mosquito menace rajamouli son karthikeya satirical video

చర్చనీయాంశమైన రాజమౌళి కుమారుడి వీడియో  

సాక్షి, హైదరాబాద్‌:  గ్రేటర్‌ వ్యాప్తంగా 4,846 కాలనీల్లోని నీటినిల్వ ప్రదేశాలు, చెరువులు, కుంటలు, సెల్లార్లల్లో దోమల నివారణ చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం చెబుతున్నా నగరవాసులకు దోమకాటు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీడైరెక్టర్‌ రాజమౌళి కొడుకు కార్తికేయ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వ్యంగ్య వీడియో చర్చనీయాంశమైంది. 

షూటింగ్‌ సమయంలో  దోమల వల్ల నటులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందుల్ని ఆ వీడియోలో చూపించారు. నగరంలోని దోమలబెడద,ప్రజల బాధను ప్రతిబింబిస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల కూకట్‌పల్లికి చెందిన ఓ ఇంజినీరు రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడారు. చెరువుల్లో గుర్రపుడెక్క నిర్మూలన పనుల బిల్లుల వ్యవహారం కావడంతో అది కూడా చర్చనీయాంశమైంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement