స్వగృహ ప్లాట్లకు భలే డిమాండ్‌.. రూ. 56 కోట్లు ఆదాయం | Open Plot Auctions Fetch Rs 56 Crore for Rajiv Swagruha Corporation | Sakshi
Sakshi News home page

స్వగృహ ప్లాట్లకు భలే డిమాండ్‌.. రూ. 56 కోట్లు ఆదాయం

Feb 8 2026 7:21 AM | Updated on Feb 8 2026 11:37 AM

Open Plot Auctions Fetch Rs 56 Crore for Rajiv Swagruha Corporation

సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టుకు సమీపంలో బహదూర్‌పల్లి, కుర్మల్‌ గూడ ప్రాంతాల్లోని ఓపెన్‌ ప్లాట్ల విక్రయంతో రూ. 56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని  రాజీవ్‌ స్వగహ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.పి. గౌతం తెలిపారు. శనివారం బాటసింగారంలో నిర్వహించిన వేలంలో 70 ప్లాట్లను విక్రయించారు. చదరపు గజం కనీస ధర (అప్‌సెట్‌ ప్రైస్‌) రూ.25 వేలుగా నిర్ణయించగా, కొన్ని ప్లాట్లను రూ.45 వేలు, 43 వేలు, 41 వేలకు కొనుగోలు చేశారు. మొత్తమ్మీద సగటున చదరపు గజానికి రూ.31 వేలకు అమ్ముడు పోయాయి.

కాగా.. ఆదివారం తొర్రూర్‌ లేఅవుట్‌లోని 35 ఓపెన్‌ ప్లాట్లకు, బహదూర్‌ పల్లి, కుర్మల్‌ గూడలోని మరో 32 ఓపెన్‌ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్లను లాటరీ ప్రక్రియలో కేటాయించడంతో  రాజీవ్‌ స్వగహ కార్పొరేషన్‌కు రూ.11 కోట్ల ఆదాయం సమకూరింది.

ఇదీ చదవండి: శంషాబాద్‌కు కొత్త ఫేమ్‌.. ఇక మరో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌!

Advertisement
 
Advertisement
Advertisement