రిలయన్స్‌ జియో రూ. 1,984 కోట్లు బాకీ.. | Telecom Companies AGR Dues Touch Rs 1 77 Lakh Crore as of FY25 | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జియో రూ. 1,984 కోట్లు బాకీ..

Feb 8 2026 7:41 AM | Updated on Feb 8 2026 11:38 AM

Telecom Companies AGR Dues Touch Rs 1 77 Lakh Crore as of FY25

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024–25) నాటికి టెలికం కంపెనీలు సవరించిన స్థూల రాబడిపరంగా (ఏజీఆర్‌) ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలు రూ. 1.77 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపయిన వొడాఫోన్‌ ఐడియా రూ. 89,952 కోట్లు, భారతి గ్రూప్‌ రూ. 51,091 కోట్లు, టాటా గ్రూప్‌ రూ. 20,426 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ. 14,462 కోట్లు, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ రూ. 1,984 కోట్లు కట్టాల్సి ఉంది.

పార్లమెంటుకు సమర్పించిన అధికారిక డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వొడాఫోన్‌ ఐడియా కేసులో 2006–2018 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో కట్టాల్సిన బాకీలను రూ. 87,695 కోట్ల స్థాయికి పరిమితం చేసి, చెల్లించేందుకు మరింత గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే.   
 

Advertisement
 
Advertisement
Advertisement