సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు శివాజీ నటుడు హీరోయిన్ల దుస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వేదికపై శివాజీ మహిళలను అవమానించాడో అదే వేదికపై బే షరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలను అవమానించడంఫ్యాషన్ అయిపోయిందని వ్యాఖ్యానించిన సునీతా రావు, శివాజీ నోటి దురుసుతనంపై మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళల బట్టలు గురించి మాట్లాడటానికి మీరెవరు, పురుషుల దుస్తులు ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలని మహిళలు ఎక్కడైనా మాట్లాడారా అని సునీతా ప్రశ్నించారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం శివాజీకి అలవాటేనని విమర్శించారు. సనాతన ధర్మం అంటూ మహిళలపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న శివాజీకి బీజేపీ సంస్కృతి వంట పట్టినట్లు ఉంది అంటూ మండిపడ్డారు.
కాగా దండోరా సినిమా ఈవెంట్‌లో శివాజీ మహిళలపై దుస్తులుపై నోరు పారేసుకున్నాడు. సభ్యత సంస్కారం మరిచి అసభ్య పదజాలంతో వ్యాఖ్యాలు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. గాయని చిన్మయి, నటి అనసూయ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోలు మంచు మనోజ్, కమల్ కామరాజు కూడా తీవ్రంగా స్పందించారు. వీరితోపాటు సోషల్ మీడియాలో శివాజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో , తప్పయింది క్షమించండి అంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు. మరోవైపు మహిళా కమిషన్‌కూడా శివాజీపై తీవ్రంగా స్పందించి నోటీసులు జారీ చేసింది.

ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్


