రంజీ ట్రోఫీ 2025-26 తదుపరి రౌండ్ మ్యాచ్‌ల నుంచి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ శివమ్ దూబే తప్పుకొన్నారు. వాస్తవానికి నవంబర్ 16 నుంచి శరద్ పవార్ అకాడమీ వేదికగా పాండిచ్చేరితో జరగనున్న మ్యాచ్‌లో ముంబై తరపున వీరద్దరూ ఆడాల్సింది.
కానీ సౌతాఫ్రికాతో టీ20 సిరీప్‌కు సన్నదమయ్యేందుకు ఈ రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని సూర్య, దూబే నిర్ణయించుకున్నారు. ఈ స్టార్ క్రికెటర్లు ఇప్పటికే తమ నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి తెలియజేశారు. వారిద్దిరి స్ధానంలో తనుష్ కొటియన్, మోహిత్ అవస్థిలను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం సూర్య ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఎంసీఎ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ టోర్నీని టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాకంగా ఉపయోగించుకోవాలని స్కై భావిస్తున్నడంట.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ముంబై ఆటగాడు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికి ఆ తర్వాత ఆసియాకప్, ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 84 పరుగులు మాత్రమే సూర్య చేశాడు.
దీంతో స్వదేశంలో సఫారీలతో జరగనున్న టీ20 సిరీస్‌లో తన ఫామ్‌ను తిరిగి అందిపుచ్చుకోవాలని సూర్య భావిస్తున్నాడు. ప్రోటీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ డిసెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది.
చదవండి: ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే


