ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్‌కు సమయం అసన్నమైంది. దోహా వేదికగా ఈ మెగా ఈవెంట్ శుక్రవారం(నవంబర్ 14) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-ఎ, ఒమన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఆ తర్వాత అదే రోజున వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ వేదికగా భారత్-ఎ జట్టు, యూఏఈ జట్లు తలపడనున్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్ జితీష్ కుమార్ సారథ్యంలో ఇండియా-ఎ జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.
ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi), ప్రియాన్ష్ ఆర్య, ఆశుతోష్ శర్మ వంటి ఐపీఎల్ సంచలనాలు ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో యువ ఆటగాళ్లతో కూడిన భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. గ్రూపు-బిలో భారత్‌తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ క్రమంలో యూఏఈతో మ్యాచ్‌లో భారత్ ఆడే ప్లేయింగ్ ఎలెవన్‌ను క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఓపెనర్లగా వైభవ్, ఆర్య..
ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ను యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో ఓపెనర్లగా తమ సత్తాను నిరూపించుకున్నారు. ఫస్ట్ డౌన్‌లో నమన్ ధీర్ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.
గత ఐపీఎల్ సీజన్‌లో నమన్ ముంబై ఇండియన్స్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచారు. మిడిలార్డర్‌లో నేహాల్ వధేరా, కెప్టెన్ జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఫినిషర్‌గా ఆశుతోశ్ శర్మకు తుది జట్టులో దక్కనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆల్‌రౌండర్ల కోటాలో రమణ్‌దీప్ సింగ్, హర్ష్ దూబేలకు మెనెజ్‌మెంట్ అవకాశమివ్వనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్ యష్ ఠాకూర్, గుర్జాప్‌నీత్ సింగ్, విజయ్‌కుమార్ వైశాఖ్ వంటి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
భారత-ఎ తుది జట్టు
ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నమన్ ధీర్, జితేష్ శర్మ(కెప్టెన్), అశుతోష్ శర్మ, రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, యష్ ఠాకూర్,గుర్జప్నీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్
చదవండి: IPL 2026: కేకేఆర్ జట్టులోకి షేన్ వాట్సన్..


