ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు 'అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను కేకేఆర్ నియమించింది. కోల్‌కతా హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి వాట్సన్ పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధ్రువీకరించాడు.
షేన్ వాట్సన్‌ను కేకేఆర్ కుటంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాడిగా, కోచ్‌గా అతడి అనుభవం మా జట్టు సన్నద్దతకు ఉపయోగపడుతోంది. టీ20 ఫార్మాట్‌పై అతడి అవగహన మా జట్టును మరో స్ధాయి తీసుకువెళ్తుందని ఆశిస్తున్నాము అని వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ట్రాక్ రికార్డు అదుర్స్
కాగా ఐపీఎల్‌లో షేన్ వాట్సన్ ఆటగాడిగా, కోచ్‌గా తన సేవలను అందించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన వాట్సన్.. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. 2013 సీజన్‌లో కూడా మరోసారి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు. ఐపీఎల్-2018 సీజన్‌లో సీఎస్‌కే ఛాంపియన్‌గా నిలవడంలో వాట్సన్‌ది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో షేన్ చెలరేగాడు.
ఇకఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా కూడా వాట్సన్ పనిచేశాడు. ఇప్పుడు తొలిసారి కేకేఆర్ కోచింగ్ స్టాప్‌లో ఈ ఆసీస్ దిగ్గజం భాగంకానున్నాడు. ఇక కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక కావడం పట్ల షేన్ వాట్సన్ ఆనందం వ్యక్తం చేశాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ వంటి అద్భుత ఫ్రాంచైజీలో భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం. కోల్‌కతాకు మరో టైటిల్‌ను అందించడానికి అన్ని విధాలగా కృషి చేస్తానని వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్.. గత సీజన్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌పై కేకేఆర్ వేటు వేసింది.
చదవండి: నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న మరో భారత స్టార్ క్రికెటర్


