మౌంట్ మౌంగానుయి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 316 బంతుల్లో తన రెండో టెస్టు డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
178 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కాన్వే దూకుడుగా ఆడి తన ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 367 బంతులు ఎదుర్కొన్న కాన్వే.. 31 ఫోర్ల సాయంతో 508 పరుగులు చేశాడు. ఇంతకుముందు డెవాన్ ఇంగ్లండ్‌పై తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు.
కాన్వే-లాథమ్ వరల్డ్ రికార్డు..
ఈ మ్యాచ్‌లో డెవాన్ కాన్వేతో పాటు కెప్టెన్ టామ్ లాథమ్ కూడా (246 బంతుల్లో 137; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 323 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ సాధించిన జోడీగా లాథమ్- కాన్వే చరిత్ర సృష్టించారు.
అదేవిధంగా డబ్ల్యూటీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో 2019లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ- మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌కు 317 పరుగులు జోడించగా.. లాథమ్- కాన్వే ఈ రికార్డును బ్రేక్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 145 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 508 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్..
కాగా డబుల్ సెంచరీ వీరుడు డెవాన్ కాన్వే ఇటీవల జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కాన్వేను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఐపీఎల్‌లో కూడా మంచి రికార్డును డెవాన్‌ను ఎవరూ తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. గతంలో అతడు సీఎస్‌కే ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: Ashes 2025: స్టోక్స్, ఆర్చర్ విరోచిత పోరాటం.. ఇంగ్లండ్ ఆలౌట్


