ఐపీఎల్-2026 మినీ వేలం అబుదాబి వేదికగా విజయవంతంగా ముగిసింది. పది జట్లు 77 మంది ఆటగాళ్ల స్ధానాలను భర్తీ చేశాయి. ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ నిలిచాడు. గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధర వెచ్చించి మరీ కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది.
తద్వారా అతడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. అదేవిధంగా అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల పంట కూడా పండింది. ఉత్తరప్రదేశ్ స్పిన్ ఆల్‌రౌండర్ 20 ఏళ్ల ప్రశాంత్ వీర్, రాజస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మలను రికార్డు స్ధాయిలో రూ.14.20 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది.
రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఈ ఇద్దరూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న అన్‌క్యాప్డ్ ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. అయితే ఈ వేలంలో స్టీవ్ స్మిత్, డెవాన్ కాన్వే వంటి కొంతమంది స్టార్ ప్లేయర్లు అమ్ముడుపోలేదు. ఈ క్రమంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పూర్తి ఆటగాళ్ల జాబితాపై ఓ లుక్కేద్దాం.
ఐపీఎల్-2026 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్
డెవాన్ కాన్వే
గుస్ అట్కిన్సన్
వియాన్ ముల్డర్
దీపక్ హుడా
కేఎస్ భరత్
రహ్మానుల్లా గుర్బాజ్
జానీ బెయిర్‌స్టో
జామీ స్మిత్
గెరాల్డ్ కోయెట్జీ
స్పెన్సర్ జాన్సన్
ఫజల్హక్ ఫారూఖీ
మహేశ్ తీక్షణ
ముజీబ్ ఉర్ రెహమాన్
అథర్వ తైదే
అన్మోల్‌ప్రీత్ సింగ్
అభినవ్ తేజ్రానా
అభినవ్ మనోహర్
యష్ ధుల్
ఆర్య దేశాయ్
విజయ్ శంకర్
రాజవర్ధన్ హంగారేకర్
మహిపాల్ లోమ్రోర్
ఈడెన్ ఆపిల్ టామ్
తనుష్ కోటియన్
సన్వీర్ సింగ్
రుచిత్ అహిర్
కమలేష్ నాగరకోటి
వంశ్ బేడీ
తుషార్ రహేజా
రాజ్ లింబాని
సిమర్‌జీత్ సింగ్
ఆకాష్ మధ్వల్
శివం శుక్లా
వహిదుల్లా జద్రాన్
కర్ణ్ శర్మ
కుమార్ కార్తికేయ
సెడిఖుల్లా అటల్
మైఖేల్ బ్రేస్వెల్
సీన్ అబాట్
డారిల్ మిచెల్
దాసున్ శనక
చేతన్ సకారియా
వకార్ సలాంఖీల్
సల్మాన్ నిజార్
మయాంక్ రావత్
కేఎమ్ ఆసిఫ్
మురుగన్ అశ్విన్
తేజస్ బరోకా
కేసీ కరియప్ప
మోహిత్ రాథీ
డాన్ లారెన్స్
తస్కిన్ అహ్మద్
రిచర్డ్ గ్లీసన్
అల్జారీ జోసెఫ్
రిలే మెరెడిత్
ఝే రిచర్డ్‌సన్
ధీరజ్ కుమార్
తనయ్ త్యాగరాజన్
ఇర్ఫాన్ ఉమైర్
చింతల్ గాంధీ
విశాల్ నిషాద్
నాథన్ స్మిత్
డేనియల్ లాటెగాన్
కరణ్ లాల్
ఉత్కర్ష్ సింగ్
ఆయుష్ వర్తక్
జిక్కు బ్రైట్
ఇజాజ్ సవారియా
మణిశంకర్ మురాసింగ్
మనన్ వోహ్రా
మయాంక్ దాగర్
మనీ గ్రేవాల్
మాక్నీల్ నోరోన్హా
సిద్ధార్థ్ యాదవ్
రితిక్ టాడా
చామ మిలింద్
స్వస్తిక్ చికారా
విలియం సదర్లాండ్
ఆర్ఎస్ అంబరీష్


